News February 26, 2026

పార్వతీపురం: ‘ఉగాది నాటికి 7,187 ఇళ్లు పూర్తి కావాలి’

image

జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ డా.ఎన్ ప్రభాకర రెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో భాగంగా గృహ నిర్మాణ పురోగతిపై కీలక సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉగాది పండగ నాటికి మొత్తం 7,187 ఇళ్లను పూర్తి చేయాలన్నారు.

Similar News

News February 28, 2026

నెల్లూరు: 3.45 లక్షల ఎకరాల్లో వరిసాగు.!

image

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరలు దక్కడం లేదు. జిల్లాలో ఈ ఏడాది రబీలో 3.45 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి రానుంది. వచ్చే నెల నుంచి జిల్లాలో 161 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. 5 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

News February 28, 2026

విజయ్‌కు దెబ్బ మీద దెబ్బ!

image

తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి గడ్డుకాలం ఎదురవుతోంది. తొలుత కరూర్ తొక్కిసలాటలో 41 మంది చనిపోవడంతో ఆయనపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దానిపై సీబీఐ ఎంక్వైరీ జరిగింది. తన చివరి చిత్రం ‘జననాయగన్’ సెన్సార్ సర్టిఫికెట్ కారణంగా విడుదల కాలేదు. ఎప్పుడవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. తాజాగా విజయ్ భార్య విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

News February 28, 2026

సిద్దిపేట: ఆయిల్ ఫామ్ సాగుపై కలెక్టర్ సమీక్ష

image

ఆయిల్ ఫామ్ సాగుపై శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యానశాఖ, ఆయిల్ ఫామ్ అధికారులతో కలెక్టర్ హైమావతి సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫ్రైడ్ అధికారుల పనితీరు మందకోడిగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయిల్ ఫామ్ సాగుకు రైతులను ప్రోత్సహించాలని వ్యక్తిగతంగా కేటాయించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా చేరుకోవాలని ఆదేశించారు.