News November 16, 2025
పార్వతీపురం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల అహ్వానం

సివిల్స్‌లో ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా బీసీ సంక్షేమ, సాధికారిత అధికారి అప్పన్న శనివారం తెలిపారు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు.అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి దరఖాస్తును పార్వతీపురంలోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయానికి నవంబర్ 25లోగా సమర్పించాలన్నారు.
Similar News
News November 16, 2025
ఖమ్మం: ‘క్యాంపెయిన్ 5.0’తో స్కూళ్లపై ఉన్నతాధికారుల దృష్టి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో విద్యాశాఖ ‘స్పెషల్ క్యాంపెయిన్ 5.0’ తనిఖీలను చేపట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపటి నుంచి 22వ తేదీ వరకు ఉన్నతాధికారులు ముమ్మరంగా పర్యవేక్షించనున్నారు. పాఠశాలల్లో కనీస వసతులు, పరిశుభ్రత, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ పర్యవేక్షణకు ఖమ్మంకు శ్రీనివాసాచారి, కొత్తగూడెంకు వెంకటనర్సమ్మలు ఇన్చార్జ్‌లుగా వ్యవహరిస్తారు.
News November 16, 2025
వాషింగ్ మెషీన్ వాడుతున్నారా?

వాషింగ్ మెషీన్ ఉపయోగించడంలో కొన్ని టిప్స్ పాటిస్తే దుస్తులు, మెషీన్ మన్నిక బావుంటుంది. * కాస్త గట్టి వస్తువులు, సున్నితమైన వస్తువుల్ని జిప్‌లాక్ ఉన్న మెష్ బ్యాగ్‌లో వేసి వాషర్‌లో వేయాలి. * క్విక్ వాష్ ఆప్షన్ ఎంచుకుంటే బట్టల నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. * గాఢత తక్కువున్న డిటర్జెంట్ వాడాలి. * వేటిని ఉతకాలన్నా వాషింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ బట్టి ఉతకాలి. * దుర్వాసన వస్తుంటే కాస్త వెనిగర్ వేయాలి.
News November 16, 2025
డ్రైవర్ అన్నలూ.. ప్రాణాలు తీయకండి!

రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాల వల్ల జరిగే ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వెహికల్ బ్రేక్ డౌన్ అవ్వడం, ఇతర పనుల వల్ల కొందరు డ్రైవర్లు రోడ్డు పక్కనే బండ్లు ఆపుతారు. కనీసం సిగ్నల్ లైట్లు వేయరు. రేడియం రిఫ్లెక్టర్లు ఉండవు. దీనివల్ల రాత్రి వేళల్లో వెనుక నుంచి వస్తున్న వాహనాలకు అవి కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. చలికాలంలో పొగమంచు వల్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
Share it


