News February 23, 2025

పార్వతీపురం: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 2,333 మంది 

image

పార్వతీపురం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 2,333 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. అత్యధికంగా పార్వతీపురంలో 636 మంది, అత్యల్పంగా పాచిపెంటలో 34 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు 18 మంది POలు, 18 APOలు, 36 OPOలు, 18 మంది ఎంఓలను నియమించినట్లు పేర్కొన్నారు.

Similar News

News July 5, 2025

నితిన్ ఖాతాలో మరో ప్లాప్?

image

నిన్న విడుదలైన ‘తమ్ముడు’ మూవీపై సినీ అభిమానులు, క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు. వరుస ప్లాప్‌ల తర్వాత కథ విషయంలో నితిన్ ఏమాత్రం జాగ్రత్త తీసుకోలేదని, మరో ఫెయిల్యూర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడని అంటున్నారు. డైరెక్టర్ వేణు ఏం చెప్పాలనుకున్నారో ఎవరికీ అర్థం కాలేదని, నిర్మాత దిల్ రాజు ఈ మూవీని ఎలా అంగీకరించారో ఆశ్చర్యంగా ఉందని SMలో కామెంట్స్ చేస్తున్నారు. మీరూ ఈ సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.

News July 5, 2025

రాయపోల్: వడ్డేపల్లిలో మరోసారి చిరుతపులి కలకలం

image

రాయపోల్ మండలం వడ్డేపల్లిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఇంతకు ముందు చిరుతపులి ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు గుర్తించినా పట్టుకోవడంలో విఫలం అయ్యారని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామానికి చెందిన నవీన్ కుమార్ శుక్రవారం గేదెలను మేతకు తీసుకెళ్లాడు. సమీపంలో చిరుత కనిపించడంతో భయాందోళను గురయ్యాడు. సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించాడు.

News July 5, 2025

HYD: POLYCET ఫేజ్-1 రిజల్ట్ కోసం ఎదురుచూపులు..!

image

HYD, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో POLYCET-2025లో ఉత్తీర్ణులైన అనేక మంది కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఫేజ్-1 కోసం వెబ్ ఆప్షన్లు సైతం అందజేశారు. అయితే శుక్రవారం ఫేజ్-1 అలాట్మెంట్ రిజల్ట్ రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రాలేదు. మొబైల్ ఫోన్లకు మెసేజ్లు ఎప్పుడు వస్తాయో అని ఉత్తీర్ణులైన విద్యార్థులు రాత్రంతా ఎదురుచూశారు. మరోవైపు రేపే సీటు వచ్చిన కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంది.