News January 31, 2025
పార్వతీపురం: ఎస్పీగా బాధ్యతలు..24 గంటల్లోనే ఉద్యోగ విరమణ

పార్వతీపురం జిల్లా అదనపు ఎస్సీగా గురువారం ఎల్.నాగేశ్వరి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆమె అమరావతి నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. కాగా విధుల్లో చేరిన 24 గంటల్లో తాను విద్యాభ్యాసం ప్రారంభించిన పార్వతీపురంలో ఉద్యోగ విరమణ చేయనుండడం విశేషం
Similar News
News December 30, 2025
రెండు పరీక్షలు రీషెడ్యూల్ చేసిన CBSE

అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్‌తో 10, 12వ తరగతుల రెండు పరీక్షలు రీ షెడ్యూల్ చేస్తున్నట్లు CBSE తెలిపింది. 2026 MAR 3న జరగాల్సిన 10వ తరగతి లాంగ్వేజెస్/ఎలక్టివ్ పేపర్ ఎగ్జామ్ MAR 11న ఉంటుంది. ఇక 12వ తరగతి విద్యార్థులకు MAR3న షెడ్యూల్ అయిన లీగల్ స్టడీస్ ఎగ్జామ్ తేదీ APR 10కి మార్చినట్లు తాజా ప్రకటనలో వెల్లడించింది. మిగతావి పాత షెడ్యూల్ ప్రకారమే ఉంటాయని CBSE పేర్కొంది.
Share It
News December 30, 2025
భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 11 మంది అరెస్ట్

అస్సాం పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న 11 మంది ఉగ్రవాదులను అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో బార్పేటా, చిరాంగ్, దరాంగ్ జిల్లాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. భారీ దాడులకు వీరు ప్లాన్ వేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వారి నుంచి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.
News December 30, 2025
చిత్తూరు జిల్లా పరిపాలన పునర్వ్యవస్థీకరణ

పలమనేరు రెవెన్యూ డివిజన్‌లో ఉన్న బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మార్పు 2025 డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు గెజిట్‌లో ఉత్తర్వులు ప్రచురించనున్నారు. ఈ మార్పుతో బంగారుపాలెం మండల ప్రజలకు చిత్తూరు కేంద్రంగా పరిపాలనా సేవలు అందనున్నాయి.


