News February 6, 2025

పార్వతీపురం: ‘ఒక్క మాతా, శిశు మరణం కూడా సంభవించకూడదు’

image

పార్వతీపురం జిల్లాలో ఒక్క మాతా, శిశు మరణం కూడా సంభవించకూడదని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులకు హితవు పలికారు. ప్రతి గర్భిణీ స్త్రీ ప్రసవం అయ్యే వరకు సంబంధిత పిహెచ్సీ వైద్యాధికారి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రసవాలు సురక్షంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Similar News

News October 28, 2025

ఎర్ర కాలువ పటిష్టతకు చర్యలు: మంత్రి కందుల

image

మొంథా తుఫాన్ ప్రభావం ధాటికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని మంత్రి కందుల దుర్గేశ్ మంగళవారం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నిడదవోలు నియోజకవర్గంలోని ఎర్ర కాలువ ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ఎర్ర కాలువ పరివాహక గ్రామాల రైతులకు, ప్రజలకు తాజా పరిస్థితిని క్రమం తప్పకుండా వెల్లడించాలన్నారు.

News October 28, 2025

ఇంటర్వ్యూతోనే NIRDPRలో ఉద్యోగాలు..

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) 9పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది. వీటిలో సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. బీఈ, బీటెక్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఎర్త్& ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియో ఇన్ఫర్మాటిక్స్, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 29న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: http://career.nirdpr.in

News October 28, 2025

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విశాఖ కలెక్టర్ పర్యటన

image

విశాఖలోని మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పర్యటించారు. కైలాసపురం, శాంతి నగర్, కస్తూరి నగర్, మాధవధార అంబేద్కర్ కాలనీలో కొండచరియలు ఇళ్లపై పడడంతో పరిస్థితిని సమీక్షించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, దెబ్బతిన్న ఇల్లు వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరివేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.