News April 9, 2025
పార్వతీపురం : కంటైనర్‌లో అంగన్వాడీ కేంద్రం

పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో కంటైనర్‌లో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సీడీపీఓ శ్రీనివాసరావు తెలిపారు. గ్రామంలో ఐదవ అంగన్వాడీ నిర్వహణకు సచివాలయం వద్ద కంటైనర్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే సాలూరులో ఆసుపత్రులను సైతం కంటైనర్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 25, 2026
పాకిస్థానీల బెదిరింపులు.. లండన్‌లో ఇండియన్ రెస్టారెంట్ బంద్!

లండన్‌లో 16 ఏళ్లుగా భారతీయ వంటకాలను వడ్డిస్తున్న ‘రంగ్‌రేజ్’ రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు దాని ఓనర్ హర్మన్ సింగ్ కపూర్ ప్రకటించారు. పాకిస్థానీల నుంచి ఎదురవుతున్న దాడులు, ఆన్‌లైన్ వేధింపులు, పోలీసుల నుంచి సరైన మద్దతు లభించకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఆరోపించారు. ఖలిస్థాన్ ఉద్యమాన్ని విమర్శిస్తూ SMలో వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి కపూర్ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం.
News February 25, 2026
‘కేరళం’ సరే.. ప్రాజెక్టులేవీ: శశి థరూర్

కేరళ పేరును ‘కేరళం’గా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై MP శశి థరూర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మలయాళంలో ఇప్పటికే కేరళం అనే పిలుస్తారని, ఇప్పుడు ఆ పదాన్ని ఇంగ్లీషులోకి తీసుకురావడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. పేరు మార్పుపై చూపిస్తున్న శ్రద్ధను రాష్ట్ర అభివృద్ధిపై చూపడం లేదని విమర్శించారు. బడ్జెట్‌లో కేరళకు ఒక్క కొత్త ప్రాజెక్టూ ఇవ్వలేదని, AIIMS వంటి కీలక సంస్థలను కేటాయించలేదని ఆరోపించారు.
News February 25, 2026
గుంటూరు వన్ స్టాప్ సెంటర్‌లో ఉద్యోగాలు

గుంటూరు జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ వన్ స్టాప్ సెంటర్‌లో 14 కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు. అడ్మినిస్ట్రేటర్, కేసు వర్కర్, కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, సెక్యూరిటీ తదితర ఖాళీలున్నాయి. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు స్వశక్తి భవన్‌ను సంప్రదించాలన్నారు.


