News December 21, 2024

పార్వతీపురం: కరెంట్ షాక్‌తో అన్నదమ్ములు మృతి

image

కరెంటు షాక్ తగిలి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు వైకుంఠపు శ్రీను, సింహాచలం అనే ఇద్దరు అన్నదమ్ములు మరువాడలో పొలం పని నిమిత్తం వెళ్లారు. పనులు చేస్తుండగా.. కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 5, 2025

మంత్రి కొండపల్లితో ఈ-వెహికల్ సంస్థ ప్రతినిధులు భేటీ

image

విజయవాడ ఏపీ సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఈ-వెహికల్ సంస్థ ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.

News February 5, 2025

ఈ నెల 8న కొత్తవలసకు మాజీ ఉపరాష్ట్రపతి

image

కొత్తవలస మండలంలోని చింతలపాలెంలో ఈ నెల 8న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. భీష్మ ఏకాదశి పర్వదినం పురష్కరించుకుని చిట్టిపాప తీర్ధ మహోత్సవం సందర్భంగా జరగనున్న సాహిత్యగోష్టికి వెంకయ్యనాయుడు హాజరవుతారని సర్పంచ్ సీతారామపాత్రుడు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారని చెప్పారు.

News February 4, 2025

విశాఖలోని విజయనగరం వాసి ఆత్మహత్య

image

విశాఖలోని విజయనగరం వాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మృతుడు విజయనగరం జిల్లా తెర్లాం మండలం పనుకువలస గ్రామానికి చెందిన అలుగుబెల్లి గణేశ్ (43)గా పోలీసులు గుర్తించారు. విశాఖలో పెయింటర్‌గా పనిచేస్తున్న గణేశ్ మిథిలాపురిలోని ఉడాకాలనీలో 9 నెలలుగా ఉంటున్నాడు. కాగా మంగళవారం ఉదయం హాల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతిచెందినట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు.

error: Content is protected !!