News October 25, 2025
పార్వతీపురం: కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 08963 796085 నంబర్‌కి ఫోన్ చేస్తే, వెంటనే సహాయక చర్యలు చేపడతామన్నారు.
Similar News
News October 26, 2025
పండుగ రోజున ఉల్లిపాయ ఎందుకు తినకూడదు?

ఉల్లిపాయలో ఉండే తామసిక గుణం వల్ల మన శరీరంలో వేడి, ఉత్తేజం పెరుగుతుంది. పండుగ రోజుల్లో మన మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా, భగవత్ చింతనలో ఉండాలంటే.. శరీరంలో ఈ గుణం ఉండకూడదు. అందుకే పర్వదినాన ఉల్లిపాయ వద్దంటారు. ఉల్లిపాయను తింటే అది మన ఏకాగ్రతను భంగపరచి, మనస్సును లౌకిక విషయాల వైపు మళ్లిస్తుంది. ఉల్లిపాయను తినకుండా ఉంటే మనస్సు నిర్మలంగా ఉండి, భగవంతునికి మరింత దగ్గరవుతామని నమ్మకం. <<-se>>#DHARMASANDEHALU<<>>
News October 26, 2025
అమ్మకిచ్చిన మాట కోసం 150 డిగ్రీలు చేశాడు!

చెన్నై ప్రొఫెసర్ డా.పార్థిబన్ ఇప్పటివరకు 150 డిగ్రీ పట్టాలు అందుకున్నారు. తొలిసారి డిగ్రీ పాసైనప్పుడు తక్కువ మార్కులు రావడంతో తన తల్లి బాధపడిందని, దీంతో టాప్ ర్యాంక్ మార్కులు తెచ్చుకుంటానని ఆమెకు వాగ్దానం చేసినట్లు ఆయన తెలిపారు. 1981 నుంచి చదువుతున్నారు. చదవడాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నానని, 200 డిగ్రీలు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆయన చదివిన వాటిలో MA, MPhil, MSc. PG, PhD వంటి కోర్సులున్నాయి.
News October 26, 2025
MBNR: BRS విజయం.. అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్

HYDలోని MTAR Technologies Ltd కంపెనీలో భారత రాష్ట్ర సమితి నుంచి కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికలలో భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పై గెలుపొందారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం పెట్టుకొని గెలిపించిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీలో కార్మికులకు ఉన్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.


