News December 19, 2025
పార్వతీపురం కలెక్టర్ ఆలోచన రాష్ట్రవ్యాప్తంగా అమలు

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అమలు చేసిన ముస్తాబు కార్యక్రమం బాగుందని CM చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రభాకర్‌ను ప్రశంసించిన విషయం తెలిసిందే. రేపట్ని నుంచి ముస్తాబు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాలల వద్దే విద్యార్థుల్ని చక్కగా రెడీ అయ్యేలా చూడటం, క్లాస్ రూంలు, పరిసరాలను శుభ్రం చేయడం చేస్తారు.
Similar News
News December 20, 2025
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కఠిన చర్యలు: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో రోడ్డు నియమాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం రోడ్డు భద్రత మాసోత్సవాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని.. పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
News December 20, 2025
సురక్షిత డ్రైవింగ్‌తో ప్రమాదాల నివారణ: మంత్రి పొన్నం

సురక్షిత డ్రైవింగ్ విధానంతో రహదారి ప్రమాదాలను నివారించవచ్చని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, రవాణా శాఖ స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, లా అండ్ ఆర్డర్ డిజి మహేష్ భగవత్‌లతో కలిసి హైదరాబాద్ నుంచి రహదారి భద్రత మాసోత్సవాల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News December 20, 2025
రహదారి భద్రత మాసోత్సవాలు ఘనంగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఈ కార్యక్రమాలలో ప్రజలు, అధికారులు, ఆర్టీసీ డ్రైవర్లను భాగస్వామ్యం చేయాలన్నారు. రోడ్డు భద్రత నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. విద్యార్థుల్లో రహదారి నియమాల పట్ల అవగాహన కలిగేలా వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు.


