News February 25, 2026
పార్వతీపురం: ‘గర్భిణీల్లో ప్రమాదకర లక్షణాలను సకాలంలో గుర్తించాలి’

గర్భిణీల్లో ప్రమాదకర లక్షణాలను ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స, పర్యవేక్షణ చేయాలని DMHO డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. హైరిస్క్ గర్భిణీల ఆరోగ్య నిర్వహణ, నియమాలపై వైద్యాధికారులకు ఓరియంటేషన్ శిక్షణను పార్వతీపురంలోని ఎన్జీవో హోమ్‌లో బుధవారం నిర్వహించారు. గర్భిణీల్లో ప్రధాన హైరిస్క్ సమస్యలైన అక్లాంప్సియా, యుక్త వయసులో గర్భం దాల్చడం, దీర్ఘంగా ఉండే జ్వర లక్షణాలు సకాలంలో గుర్తించాలన్నారు.
Similar News
News February 28, 2026
అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద మొత్తం 217 డ్రోన్లు స్వాధీనం

అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద విజిలెన్స్&సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో డ్రోన్లు, స్పై కెమెరా గల మెటా గ్లాసెస్ భారీగా పట్టుబడ్డాయి. 2025లో 151 డ్రోన్లు, 44 గ్లాసెస్, 2026 జనవరిలో 47 డ్రోన్లు, 13 గ్లాసెస్, ఫిబ్రవరిలో ఇప్పటివరకు 19 డ్రోన్లు, 14 గ్లాసెస్‌ను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. తిరుమలలో డ్రోన్లు, గూఢచారి కెమెరాలు నిషేధమని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు.
News February 28, 2026
ఖమ్మం కూల్చివేతలపై ఎన్‌హెచ్ఆర్సీ దర్యాప్తు?

ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల పేరుతో సుమారు 600 పేదల ఇళ్లను కూల్చి వేసిన ఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు ప్రారంభించింది. ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు మేరకు కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కమిషన్ ఆదేశించినట్లు సమాచారం.
News February 28, 2026
అనంత: హాకీలో సత్తా చాటిన యువకుడు యువన్ క్రిష్

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన హాకీ టోర్నమెంట్‌లో యువకుడు యువన్ క్రిష్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న యువన్ క్రిష్ అండర్ 10 హాకీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. భవిష్యత్తులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని పాఠశాల హెచ్ఎం నారాయణ, ఉపాధ్యాయ బృందం అభినందించారు.


