News August 12, 2024

పార్వతీపురం: గుంటూరు – రాయగడ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

image

గత ఆరు నెలలుగా నిలిపివేసిన గుంటూరు – రాయగడ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సర్వీస్‌లు పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. ఈ రైలు విజయనగరం, పార్వతీపురంతో పాటు పలు చోట్ల ఆగనుంది. రైలును పునరుద్ధరించడంతో జిల్లా వాసులకు, ముఖ్యంగా గిరిజన ప్రాంత వాసులకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఈ నిర్ణయంపై ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Similar News

News November 24, 2024

VZM: పిక్నిక్ స్పాట్స్ వద్ద నిఘా

image

పార్వతీపురం, విజయనగరం ఎస్పీల ఆదేశాలతో పర్యాటక ప్రాంతాలు, పిక్నిక్ స్పాట్స్ వద్ద పోలీసులు ఆదివారం బందోబస్తు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. తోటపల్లి, అడ్డాపుశీల, సీతంపేట, అడలి, పుణ్యగిరి, తాటిపూడి, రామతీర్థం, సారిపల్లి, రామనారాయణం, గోవిందపురం తదితర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకున్నారు. మరి మీరు ఈరోజు ఎక్కడికి పిక్నిక్‌కు వెళ్లారో కామెంట్ చెయ్యండి.

News November 24, 2024

IPL వేలంలో మన విజయనగరం కుర్రాడు

image

ఐపీఎల్ మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన బైలపూడి యశ్వంత్ రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ఈయన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్‌గా క్రికెట్‌లో రాణిస్తున్నాడు. మన జిల్లా వాసిగా యశ్వంత్ ఐపీఎల్‌కు ఎంపిక కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏ టీమ్‌కు సెలెక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.

News November 24, 2024

VZM: ఒంటరితనం భరించలేక మహిళ సూసైడ్

image

బాడంగి మండలం కోడూరు పంచాయతీకి చెందిన గౌరమ్మ(55) శనివారం మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గౌరమ్మ భర్త కొంతకాలం క్రితం మృతిచెందారు. అప్పటి నుంచి ఆమె ఒంటరితనంతో మనస్తాపం చెందింది. ఈ క్రమంలో ఈనెల 14న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. మృతురాలి అన్నయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.