News April 12, 2025
పార్వతీపురం: ‘గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత’

పార్వతీపురం జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, ఇచ్చిన లక్ష్యాలను నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రతీ మండలంలో నెలకు 1,000 గృహాలు పూర్తిచేయాలని లక్ష్యాలను నిర్దేశించామని, కనీసం 500 గృహాలైన పూర్తిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మే నెలలోగా 1,600 గృహాలు పూర్తిచేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 17, 2025
అమరవీరులకు నివాళులర్పించిన సీఎం

TG: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహిస్తున్న ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు. పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. వారి త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. మరోవైపు ఖమ్మంలో జరిగిన వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
News September 17, 2025
ADB: రాంజీ గోండ్.. అడవిలో అడుగులేసిన విప్లవం

బ్రిటిష్, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన వీరుడు రాంజీ గోండ్. ఆయన 1857 భారత స్వాతంత్ర్య సంగ్రామం కంటే ముందే నిర్మల్, ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల్లో గిరిజనులను సమీకరించి, స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అటవీ హక్కులను కాలరాస్తున్న పాలకులకు వ్యతిరేకంగా ఆయన గెరిల్లా యుద్ధం నడిపారు. 1860లో బ్రిటిష్ సైన్యాలు రాంజీ గోండ్, ఆయనతో పాటు దాదాపు 1000 మంది అనుచరులను పట్టుకొని నిర్మల్‌లోని ఒక మర్రిచెట్టుకు ఉరితీశారు.
News September 17, 2025
నిజాం హింసలకు సాక్ష్యం రాయికల్ ఠాణా

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్‌లో ఉన్న పాత పోలీస్ ఠాణా, నిజాం కాలంలో జరిగిన హింసలకు నిలువెత్తు సాక్ష్యం. దొరలు, రజాకార్ల చిత్రహింసలకు ఈ భవనం వేదికగా నిలిచింది. ఇనుప చువ్వల గదులు, ఇనుప మంచాలతో రూపొందించిన ఈ బందీఖానాలో పోరాట యోధులను చిత్రవధ చేశారు. ఈ భవనంపై ప్రజలు అనేకసార్లు దాడులు చేసి నిజాంను ఎదిరించారు. నేటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఈ భవనం నాటి చరిత్రకు గుర్తుగా నిలుస్తోంది.