News January 27, 2025

పార్వతీపురం: గ్రీవెన్స్ ద్వారా 105 వినతులు స్వీకరణ

image

పార్వతీపురం కల్టెరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిశీలించి, ఆ సమస్య పరిష్కార దిశగా కృషిచేయాలని అన్నారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తెలిపారు. కార్యక్రమంలో ప్రజల నుంచి 105 వినతులను స్వీకరించారు.

Similar News

News February 18, 2026

వినియోగదారులకు అండగా NCH.. ఫిర్యాదు చేస్తే చాలు!

image

మీరు కొన్న వస్తువు నచ్చకపోయినా లేదా డబ్బులు తిరిగి రాకపోయినా ఇక ఆందోళన వద్దు. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్-1915 (NCH) గత 9 నెలల్లో 79,521 ఫిర్యాదులను పరిష్కరించి, వినియోగదారులకు ఏకంగా ₹52 కోట్లు రిఫండ్ ఇప్పించింది. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ (ఈ-కామర్స్) మోసాలపై వచ్చిన 47,743 ఫిర్యాదులను పరిష్కరించింది. కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా డిజిటల్ పద్ధతిలోనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

News February 18, 2026

HYD: AI ఆటాపాటే కాదు.. అంధులకు కంటిపాప

image

HYD బయో ఏషియా 2026 సదస్సులో క్వాడ్రిక్ IT సంస్థ కొత్త ఆవిష్కరణలతో అదరగొట్టింది. సాఫ్ట్‌వేర్ ముచ్చట్లే కాకుండా, అంధుల కోసం స్మార్ట్ AI కేన్ తెచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. తక్కువ ధరకే లభించే ఈ స్టిక్, అడ్డంకులను పసిగట్టి వైబ్రేషన్‌తో హెచ్చరిస్తుంది. దీంతో పాటు మెడికల్ LLM, క్లోఫాస్ట్ వంటి టెక్నాలజీలతో ఫార్మా, బిజినెస్ రంగాల్లోని చిక్కుముడులను విప్పుతూ క్వాడ్రిక్ AI పవర్‌ను చాటిచెప్పింది.