News March 13, 2025
పార్వతీపురం జిల్లాకు మొదటి స్థానం తీసుకురావాలి: కలెక్టర్

పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లాకు మొదటి స్థానం వచ్చేలా కృషి చేయాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. గురువారం పార్వతీపురం డివియం ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని పేర్కొన్నారు.
Similar News
News March 13, 2025
రాష్ట్రంలోనే రెండో స్థానంలో గోదూర్

జగిత్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఇబ్రహీంపట్నం మండలంలోని గోదూరులో 40.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో గోదూర్ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. అటు మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటేనే జరుగుతున్నారు.
News March 13, 2025
జగిత్యాల: కొడుకుపై ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు

తమ కుమారులు తమను పోషించడం లేదని మల్లెల మండలం పోతారం గ్రామానికి చెందిన చిన్న నిమ్మ నర్సయ్య- భూమక్క అనే వృద్ధ దంపతులు గురువారం జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ ను ఆశ్రయించారు. తాము కట్టించిన ఇండ్లలో తమకు చోటు ఇవ్వడంలేదని, తమకు తిండి సరిగా పెట్టడం లేదని, బిపి, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నామని రోదిస్తూ చెప్పారు. ఈ విషయమై అడిగితే కొడుకు, కోడలు కొడుతున్నారని ఫిర్యాదు చేశారు. వారి వెంట హరి, అశోక్ కుమార్ ఉన్నారు.
News March 13, 2025
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు ధ్రువీకరణ పత్రం

ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లికంటి సత్యంకు అసెంబ్లీ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గురువారం ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, సీపీఐ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.