News April 12, 2025
పార్వతీపురం జిల్లాకు 6వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో పార్వతీపురం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 5,867 మంది పరీక్షలు రాయగా 4,519 మంది ఉత్తీర్ణులయ్యారు. 77% పాస్ పర్సంటేజీతో జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 5,335 మందికి 4,609 మంది పాస్ కాగా 86% పాస్ పర్సంటేజీతో 7వ స్థానంలో నిలిచింది.
Similar News
News November 3, 2025
పెన్షన్ కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు

భర్త మరణించి మూడేళ్లు గడిచినా పెన్షన్ కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్లు గోపవరం(M) సండ్రపల్లికి చెందిన చెన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. పెన్షన్ కోసం దరఖాస్తు చేసినా సచివాలయ అధికారుల నుంచి సరైన స్పందన లేదని వాపోయారు. అధికారులు కరుణించి, వితంతు పెన్షన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నట్లు ఆమె కనీటి పర్యంతమయ్యారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.
News November 3, 2025
‘పుల్లోరం’ కోడి పిల్లలకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.
News November 3, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

AP: బాపట్లలోని సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మరణించిన వారు బాపట్ల MLA నరేంద్ర వర్మ బంధువులని సమాచారం. ఎమ్మెల్యే కుమారుడి సంగీత్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను కర్లపాలెం గ్రామానికి చెందిన పుష్పవతి(60), శ్రీనివాసరాజు(54), బలరామరాజు(65), లక్ష్మి(60)గా గుర్తించారు.


