News December 26, 2025
పార్వతీపురం జిల్లాలో ఘనంగా వీర్ బాల్ దివాస్-2025 వేడుకలు

భవిష్యత్తుకు పునాదిగా ఉన్న చిన్న పిల్లలను గౌరవించేందుకు ఈ వేదిక అని జిల్లా కలెక్టర్ డా.ఎం.ప్రభాకర రెడ్డి అన్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 26న నిర్వహించే ‘వీర్ బాల్ దివాస్’ వేడుకలు మన్యం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి.శుక్రవారం పార్వతీపురంలోని ఆర్సీఎం పాఠశాలలో అవగాహన ర్యాలీ ప్రారంభించారు. చిన్న వయస్సులోనే అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించిన సాహిబ్‌జాదాల చరిత్ర నేటి తరం పిల్లలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
Similar News
News December 27, 2025
కరీంనగర్: నూతన సర్పంచులను సన్మానించిన మంత్రి

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మానించారు. కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని, సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా కృషిచేయాలని సూచించారు. MLAలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి ఉన్నారు.
News December 27, 2025
అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం: సీపీ సునీల్ దత్

ఖమ్మం జిల్లాలో అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడికి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు CP సునీల్ దత్ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి, ఇసుక, రేషన్ బియ్యం తరలించే ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఇందులో భాగంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని, అలాగే డ్రంక్&డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు.
News December 27, 2025
R&R ప్యాకేజీపై కలెక్టర్ సీరియస్.. ‘పంపిణీలో జాప్యం వద్దు’

పాడేరు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస(R&R) ప్యాకేజీ పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. పంపిణీలో అలసత్వం వహించరాదని స్పష్టం చేశారు. నిర్వాసితులను అయోమయానికి గురిచేస్తూ తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.


