News April 7, 2025

పార్వతీపురం జిల్లాలో నకిలీ పోలీస్ అరెస్ట్ 

image

పోలీసునంటూ పలువురి వద్ద డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పాలకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ.. ఎస్‌ఐ అబ్బాయి ఆస్పత్రిలో ఉన్నారని, డబ్బు పంపించాలని వీరఘట్టంలో పలువులు వర్తకులకు ఫోన్ చేసిన వ్యక్తిని సాంకేతిక పరిజ్ఞానంతో బాపట్లలో పట్టుకున్నామన్నారు. సీఐ చంద్రమౌలి, ఎస్‌ఐలు ప్రయోగమూర్తి, కళాధర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 11, 2025

ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని చీఫ్ ఇంజనీర్(ఇరిగేషన్), NLG డివిజన్ పరిధిలోని కార్యాలయంలో లష్కర్(229), హెల్పర్(56) పోస్టులకు అవుట్సోర్సింగ్ సేవలను అందించటానికి జిల్లా ఉపాది కల్పన కార్యాలయంలో ఎంప్యానెల్ అయినటువంటి ఆసక్తి గల ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ లను కలెక్టర్ సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు.

News April 11, 2025

GREAT: సో‘హిట్’ కావాలి

image

MPలోని జబల్పూర్‌కు చెందిన 11ఏళ్ల ఆర్చర్ సోహిత్ కుమార్ అండర్-15 జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో 720 పాయింట్లకు 710 పాయింట్లు సాధించి నేషనల్ రికార్డు సృష్టించారు. ఆయన తండ్రికి ఓ కాలు లేదు. చేతికర్రలు, తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తండ్రి కష్టాలను అధిగమిస్తుంటే, ఆ కష్టానికి ప్రతిఫలంగా సోహిత్ ఆర్చరీలో రికార్డులు నెలకొల్పుతున్నారు. 2028ఒలింపిక్స్ లక్ష్యం అంటున్నారు.

News April 11, 2025

రోజంతా నగ్నంగా పాప్ సింగర్

image

హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ బీచ్‌లో రోజంతా నగ్నంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో తెలియజేశారు. ఎండవేడికి ఆమె చర్మం ప్రభావితమైనట్లు ఫొటోలో తెలుస్తోంది. కాగా గత ఏడాది స్వీయ వివాహం చేసుకొని ఈ బ్యూటీ వార్తల్లో నిలిచారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న బ్రిట్నీ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు.

error: Content is protected !!