News February 27, 2025
పార్వతీపురం జిల్లాలో 85.60% పోలింగ్

పార్వతీపురం మన్యం జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు 85.60 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 2,333 మంది టీచర్లకు గాను 1,997 మంది ఓటేశారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
Similar News
News February 27, 2025
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 94.96 శాతం పోలింగ్

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 23 పోలింగ్ కేంద్రాల్లో 2,664 మంది మంది ఓటర్లకు గాను 2,530 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1,702 మందికి గాను 1,619, మహిళలు 962 మందికి గాను 911 మంది ఓటు వేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 94.96 శాతం పోలింగ్ నమోదయింది.
News February 27, 2025
విశాఖ జూలో పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు

విశాఖ జూపార్క్‌లో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మార్చి 2వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జూ పార్కు బయోస్కోఫ్ వద్ద పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జూ క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. 1వ క్లాస్ నుంచి పీజీ వరకు విద్యార్థులు పోటీలలో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు జూ కార్యాలయాన్ని సంప్రదించాలని, జీవవైవిద్య పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
News February 27, 2025
విశాఖ పోలీసుల పర్యవేక్షణలో పుణ్యస్నానాలు

శివరాత్రి జాగరణ అనంతరం విశాఖ నగరవాసులు గురువారం సముద్రంలో పుణ్యస్నానాలు చేశారు. వీరి కోసం అటు అధికారులు ఇటు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీస్ బలగాలను మోహరించినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. అలాగే జన సందోహంలో చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు అధునాతన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ వ్యవస్థను ఉపయోగించారు.