News July 10, 2025
పార్వతీపురం జిల్లా రైతులకు ముఖ్య గమనిక

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులకు పంట భీమా పథకాన్ని అమలు చేస్తున్నాయని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఎం ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులకు తక్కువ ప్రీమియం చెల్లింపుతో బీమా పథకం అమలు జరుగుతుందని చెప్పారు. పత్తి, అరటి పంటల బీమా జూలై 15, మొక్కజొన్న పంటకు జూలై 31, వరి పంటకు ఆగస్టు 15వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News July 10, 2025
యూరియా అధికంగా వాడితే?

యూరియా కొరత నేపథ్యంలో దాన్ని సరఫరా చేస్తామంటూనే వాడకం తగ్గించుకోవాలని కేంద్రం సూచిస్తోంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. పంట ఏపుగా పెరిగేందుకు యూరియాను అధికంగా వాడితే భూసారం తగ్గడంతో పాటు భవిష్యత్తులో దిగుబడులు తగ్గి పెట్టుబడులు పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. యూరియా నుంచి వెలువడే అమ్మోనియాతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువులపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
News July 10, 2025
గిరి ప్రదక్షిణలో తప్పిపోయిన బాలుడిని తల్లి చెంతకి చేర్చిన పోలీసులు

సింహాచలం “గిరి ప్రదక్షిణ”లో పైనాపిల్ కాలనీ సమీపంలో రెండు సంవత్సరాల బాలుడు దిక్కుతోచని స్థితిలో తిరగడం పోలీసులు గమనించి వివరాలు అడగగా చెప్పలేకపోయాడు. వెంటనే పోలీసులు పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్ ద్వారా బాలుడు గుర్తులు తెలియజేస్తూ ప్రకటన చేశారు. బాలుడు తల్లి అది విని సమీపంలో పోలీసులు ద్వారా అక్కడికి చేరుకున్నారు. బాలుడిని ఆమెకు క్షేమంగా అప్పగించారు. పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
News July 10, 2025
శ్రీకాకుళంలో నేడు ఉద్యోగ మేళా..!

శ్రీకాకుళంలోని బలగ గవర్నమెంట్ ఐటిఐలో గురువారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. మేళాలో హైదరాబాద్ హెటిరో డ్రగ్స్ ఫార్మాసిటికల్ కంపెనీలో వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు కాలేజీ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. ఇంటర్, డిప్లొమా మెకానికల్, ఐటిఐ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు కళాశాలలో హాజరవ్వాలన్నారు.