News April 9, 2025

పార్వతీపురం జిల్లా వాసులకు గ్యాస్ భారం

image

పార్వతీపురం జిల్లాలో గ్యాస్ ధరల పెంపు సామాన్యుడి తలపై గుది బండలా మారింది. గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రూ. 50 పెరగడంతో.. రూ. 860కి చేరింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ముందుగా వినియోదారుని సొమ్ముతో సిలిండర్ బుక్ చేసకుంటున్నారు. పలు కారణాలతో ఆ నగదు వినియోగదారుని ఖాతాకు జమ కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.

Similar News

News April 17, 2025

ADB: పాఠ్యపుస్తకాల గోదాంను తనిఖీ DEO

image

ఆదిలాబాద్ జిల్లాకేంద్రానికి వచ్చిన పాఠ్యపుస్తకాలను నిల్వ ఉంచిన గోదాంను DEO శ్రీనివాస్‌రెడ్డి గురువారం తనిఖీ చేశారు. జిల్లాకు ఎన్ని పుస్తకాలు కావాలి.. మనకు ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయో.. పాఠ్య పుస్తకాల మేనేజర్ సత్యనారాయణను అడిగి తెలుసుకొని ఆరా తీశారు. గోదాంలో నిల్వ ఉంచిన పుస్తకాల కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. డీఈఓ వెంట సీసీ రాజేశ్వర్ ఉన్నారు.

News April 17, 2025

534 పోస్టుల భర్తీకి కేంద్రం ఆదేశాలు

image

AP: మంగళగిరి ఎయిమ్స్‌లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విన్నపంతో 534 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పోస్టుల భర్తీకి సహకరించిన కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, జేపీ నడ్డాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News April 17, 2025

వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ క‌ర‌ప‌త్రాన్ని ఆవిష్క‌రించిన ఎంపీ 

image

రాష్ట్ర ప్ర‌భుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన 9552300009 వాట్సాప్ నంబ‌ర్ ద్వారా అన్ని ర‌కాల ప్ర‌భుత్వ సేవ‌లు సుల‌భంగా పొంద‌వ‌చ్చ‌ని విశాఖ ఎంపీ శ్రీ‌భ‌ర‌త్, క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. గురువారం విశాఖ కలెక్టరేట్‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ క‌ర‌ప‌త్రాన్ని ఆవిష్క‌రించారు. ఈ నెంబరుకు హాయ్ అని మెసేజ్ పెట్టి ప్ర‌జ‌లకు కావాల్సిన సేవను ఎంపిక చేసుకోవ‌చ్చన్నారు. 

error: Content is protected !!