News January 26, 2025

పార్వతీపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ప్రశంసాపత్రం

image

పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కే.రాబర్ట్ పాల్‌కు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ప్రశంస పత్రాన్ని అందజేశారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎస్పి ఎస్.వి మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. సకాలంలో రైతులకు విత్తనాలు అందజేసినందుకుగాను ప్రశంసాపత్రం అందజేశారు.

Similar News

News January 27, 2025

నెల్లిమర్లలో రేపు జాబ్ మేళా

image

నెల్లిమర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాధికారి ప్రశాంత్ తెలిపారు. పది, ఇంటర్, M ఫార్మసీ, B ఫార్మసీ, D ఫార్మసీ, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువతీ, యువకులు అర్హులన్నారు. వీల్స్ మార్ట్, అపోలో ఫార్మసీ, టీవీఎస్, తదితర కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయని చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆరోజు ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు.

News January 27, 2025

కిసాన్‌దాస్‌పేటలో చోరీ విఫలయత్నం

image

ఎల్లారెడ్డిపేట మండలం కిషన్ దాస్ పేటలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి ప్రయత్నించగా విఫలమైనట్లు స్థానికులు తెలిపారు. సత్తవ్వ అనే మహిళ ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కట్టెలతో ఆమె తలుపులను బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. ఈ శబ్దానికి సత్తవ్వ కేకలు వేసింది. చుట్టుపక్కల సుమారు పదిమంది యువకులు వచ్చి కట్టెలతో వారిని తరిమికొట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 27, 2025

డెలివరీ తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్

image

పాపకు జన్మనిచ్చిన తర్వాత బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తెల్లటి దుస్తుల్లో ఆమె ఓ ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె లుక్ చూడగానే అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దీపిక బొద్దుగా మారిపోయిందని, నటి రేఖలా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు. కాగా దీపిక గత సెప్టెంబర్‌లో పాపకు జన్మనిచ్చారు. గర్భిణీగా ఉండగానే ‘కల్కి’ మూవీలో నటించారు.