News February 12, 2026
పార్వతీపురం: ‘జిల్లా వ్యవసాయ రూపురేఖలు మార్చేయడమే లక్ష్యం’

వ్యవసాయ రంగంలో రూపురేఖలు మార్చేయడమే డిస్ట్రిక్ట్ అగ్రి-రూరల్ ట్రాన్స్ ఫార్మేషన్ ప్లాన్ లక్ష్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. DARTP మన జిల్లాలో ఇప్పుడే ప్రారంభమైందన్నారు. దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 24 జిల్లాలు అభ్యర్థనలు సమర్పించగా, ఏపీ నుంచి కేవలం 7 జిల్లాలు మాత్రమే ఎంపిక చేయబడ్డాయని, ఇందులో భాగంగా ఈ జిల్లా ఎంపికైందని గుర్తు చేశారు.
Similar News
News February 13, 2026
పాకిస్థాన్‌తో మ్యాచ్.. అభిషేక్ ఆడే ఛాన్సుందన్న వరుణ్

T20 WC: పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు అభిషేక్ శర్మ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉందని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నిన్న మ్యాచ్ అనంతరం చెప్పారు. అభి బాగానే కనిపించాడని, ప్రాక్టీస్ కూడా చేశాడని తెలిపారు. మరోవైపు అభిషేక్ ఒకటి లేదా రెండు మ్యాచులకు అందుబాటులో <<19122478>>ఉండకపోవచ్చని<<>> నిన్న మ్యాచుకు ముందు కెప్టెన్ సూర్య పేర్కొన్నారు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. కాగా ఫిబ్రవరి 15న భారత్-పాక్ తలపడనున్నాయి.
News February 13, 2026
RR: 16న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక

రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఫలితాలు వెళ్లడైన వెంటనే ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ కసరత్తు ప్రారంభంకానుంది. ఈ నెల 16న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక ఉంటుంది. ఇందుకోసం ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో అధికారిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే వీరు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
News February 13, 2026
ఫుట్‌వేర్ కొంటున్నారా? ఈ టిప్స్ పాటించండి

పాదాల రక్షణకు ఫుట్‌వేర్ అవసరం. అయితే చెప్పులు కొనేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు . మీ సైజ్‌కు సరిపోయే చెప్పులే కొనాలి. టైట్/ లూజ్‌గా ఉంటే నడవడానికి ఇబ్బందవుతుంది. ఫుట్‌వేర్ స్టైల్‌తో పాటు ధరకి సరిపడా క్వాలిటీ ఉందో..లేదో చూసుకోవాలి. మీ అవసరాన్ని బట్టి రెగ్యులర్ వేర్, ఫంక్షనల్ వేర్, ఆఫీస్ ఫుట్‌వేర్ ఎంచుకోవాలి. వైట్, బ్లాక్, క్రీమ్ కలర్ ఫుట్ వేర్ ఏ డ్రెస్‌కైనా మ్యాచ్ అవుతాయి.


