News January 26, 2025
పార్వతీపురం జేసీకి ప్రశంసాపత్రం.. ఎందుకంటే?

పార్వతీపురం మన్యం జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభికకు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ప్రశంస పత్రాన్ని అందజేశారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎస్పి ఎస్.వి మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రశంస పత్రం అందుకున్నారు. రీసర్వే, ధాన్యం కొనుగోలులో పారదర్శకంగా సేవలు అందజేసినందుకు గాను ప్రశంసా పత్రం అందజేశారు.
Similar News
News November 4, 2025
వరి పంటను ముందే కోస్తే ఏం జరుగుతుంది?

వరి పంటను ముందుగా కోసినట్లయితే ధాన్యంలో పచ్చి గింజలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక, కంకిలోని చివరి గింజలు పూర్తిగా నిండుకోక చాలా సన్నగా పొట్ట తెలుపు కలిగి ఉంటాయి. దీని వల్ల మిల్లింగ్ చేసినప్పుడు నిండు గింజల దిగుబడి తగ్గి అధికంగా నూక, తౌడు వస్తాయి. గింజలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ పంటను సకాలంలో కోత కోయక పోతే గింజలు ఎక్కువగా ఎండి రాలిపోవడమే కాకుండా పగుళ్లు ఏర్పడతాయి.
News November 4, 2025
మెట్‌పల్లి: నిజాయితీ చాటుకున్న యువకుడు

మెట్‌పల్లి పట్టణంలోని దుబ్బవాడలో జిల్లా బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు జెట్టి నరేంద్ర తన ఇంటి బయట రోడ్డుపై పడిపోయిన ఫోనును గుర్తించాడు. దానిని తీసి వెంటనే చుట్టుపక్కల వారిని ఫోను ఎవరిదని వివరాలు అడగగా.. ఎవరు తమకు తెలియదని చెప్పారు. దీంతో ఆ ఫోనును స్థానిక పోలీస్ స్టేషన్ లో అందజేసి పోగొట్టుకున్న వారిని గుర్తించి వారికి ఫోన్ అందజేయాలని ఆయన కోరారు. ఎండి ముక్తార్, జెట్టి నరేష్ ఉన్నారు.
News November 4, 2025
మెట్‌పల్లి: మా కష్టం చూసి దేవుడూ కరగడా..?

ఆరుగాలం కష్టం.. అంతా వృథా. MTPL(M) మెట్లచిట్టాపూర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పపక్కన నిలబడి, కన్నీరు పెట్టుకున్నఓ మహిళా రైతు ఆవేదన ఎవరికి చెప్పేది? మొన్న తుఫాను, నిన్న మొలకలు. 2 రోజులు ఎండ వచ్చిందని ఆరబెడితే, కుప్ప అడుగుభాగంలోనే ధాన్యం మొలకెత్తింది. ‘నష్టపోయిన మాపై దేవుడికి కూడా చిన్నచూపేనా?’ అంటూ గుండెలు బాదుకుంది. కష్టపడి పండించిన ధాన్యం ఇలా పాడవడం చూసి ఆ అన్నదాత కన్నీరు ఆపడం ఎవరి వశంకాలేదు.


