News August 29, 2024
పార్వతీపురం: డిగ్రీ విద్యార్థులకు క్విజ్ పోటీలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా డిగ్రీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు. సంబంధిత పోస్టర్‌ను కలెక్టర్ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. https://www.rbi90quiz.in/ ద్వారా సెప్టెంబర్ 17వ తేదీ లోగా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News November 24, 2024
VZM: పిక్నిక్ స్పాట్స్ వద్ద నిఘా
పార్వతీపురం, విజయనగరం ఎస్పీల ఆదేశాలతో పర్యాటక ప్రాంతాలు, పిక్నిక్ స్పాట్స్ వద్ద పోలీసులు ఆదివారం బందోబస్తు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. తోటపల్లి, అడ్డాపుశీల, సీతంపేట, అడలి, పుణ్యగిరి, తాటిపూడి, రామతీర్థం, సారిపల్లి, రామనారాయణం, గోవిందపురం తదితర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకున్నారు. మరి మీరు ఈరోజు ఎక్కడికి పిక్నిక్‌కు వెళ్లారో కామెంట్ చెయ్యండి.
News November 24, 2024
IPL వేలంలో మన విజయనగరం కుర్రాడు
ఐపీఎల్ మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన బైలపూడి యశ్వంత్ రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ఈయన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్‌గా క్రికెట్‌లో రాణిస్తున్నాడు. మన జిల్లా వాసిగా యశ్వంత్ ఐపీఎల్‌కు ఎంపిక కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏ టీమ్‌కు సెలెక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.
News November 24, 2024
VZM: ఒంటరితనం భరించలేక మహిళ సూసైడ్
బాడంగి మండలం కోడూరు పంచాయతీకి చెందిన గౌరమ్మ(55) శనివారం మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గౌరమ్మ భర్త కొంతకాలం క్రితం మృతిచెందారు. అప్పటి నుంచి ఆమె ఒంటరితనంతో మనస్తాపం చెందింది. ఈ క్రమంలో ఈనెల 14న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. మృతురాలి అన్నయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.