News February 6, 2025
పార్వతీపురం: ‘డీ – వార్మింగ్‌డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’
జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీన జరగనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమ బ్యానర్‌ను కలెక్టర్, వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న డీ-వార్మింగ్ డే, 17న మాప్ అప్‌డే కార్యక్రమాలు జరగనున్నాయని అన్నారు.
Similar News
News February 6, 2025
మెదక్ జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు
మెదక్ జిల్లాలో చికెన్ ధరలు తగ్గాయి. గత వారం రోజుల క్రితం కిలో రూ. 240పైగానే అమ్మారు. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్‌లెస్ KG రూ. 210 నుంచి రూ. 220, విత్ స్కిన్ రూ. 180 నుంచి రూ. 190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ. 5 నుంచి రూ. 10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమల్లో H5N1 వైరస్ కోళ్ల చనిపోవడం ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది.
News February 6, 2025
కడప: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
భార్య కాపురానికి రాలేదని వ్యక్తి ఆత్మహ్యతకు పాల్పడిన ఘటన జమ్మలమడుగు మండలంలో చోటు చేసుకుంది. జమ్మలమడుగు సీఐ లింగప్ప తెలిపిన వివరాల మేరకు.. గూడెంచెరువు గ్రామానికి చెందిన చెన్నప్ప, వరలక్ష్మి దంపతులు. సంక్రాంతి పండగకు సత్యసాయి జిల్లా ముదిగుబ్బ(M) పాలెం గ్రామానికి వెళ్లిన భార్య తిరిగి ఇంటికి రాలేదు. కాగా బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చెన్నప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
News February 6, 2025
రాజన్న సిరిసిల్ల: మహిళ ఫొటోలు, వీడియోలు తీసిన వ్యక్తి అరెస్ట్..
స్నానం చేస్తుండగా మహిళ ఫొటోలు, వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు కోనరావుపేట ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన బత్తుల అంజయ్య ఓ మహిళ స్నానం చేస్తుండగా తన సెల్ ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీశాడని బాధిత మహిళ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.