News March 22, 2024
పార్వతీపురం: తండ్రి మృతి.. బరువెక్కిన గుండెతో పరీక్ష

గుండెపోటుకు గురై మృతి చెందిన తండ్రి మృతదేహం ఇంట్లో ఉండగానే కన్నీళ్లు దిగమింగుకుంటూ బరువెక్కిన గుండెతో ఒక విద్యార్థి పదవ తరగతి పరీక్షకు హాజరైన విషాద సంఘటన శుక్రవారం పార్వతీపురం మండలంలో జరిగింది. నర్సిపురం గ్రామానికి చెందిన వినయ్ అనే విద్యార్థి తండ్రి ఎన్. సీతారాం(45) శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఇంటి వద్దే మృతి చెందాడు. కుమారుడు వినయ్ పదవ తరగతి పరీక్ష రాసిన తర్వాత అంత్యక్రియలకు హాజరయ్యాడు.
Similar News
News April 19, 2025
బొత్స వ్యూహాలు ఫలించేనా

విశాఖలో ఉదయం 11 గంటలకు GVMC మేయర్‌పై అవిశ్వాస ఓటింగ్ జరగనుంది. అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన బలం కూటమికి ఉందని MLAలు చెబుతున్నారు. YCP కార్పొరేటర్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉండాలంటూ MLC బొత్స పిలుపునిచ్చారు. అదిష్టానం నిర్ణయాన్ని దిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా కూటమిలోని పలువురు కార్పొరేటర్‌లతో బొత్స సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. మరి మేయర్ పీఠంపై బొత్స వ్యూహాలు ఫలిస్తాయా?
News April 18, 2025
బొబ్బిలిలో ఉచిత కంప్యూటర్ శిక్షణ

బొబ్బిలిలోని శ్రీవెంకటకృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న షాపింగ్ కంప్లెక్స్‌లో విద్యార్థి JAC ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణను శుక్రవారం ప్రారంభించారు. వేసవి సెలవులలో విద్యార్థులకు JAC ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు బి.సాయి కిరణ్ చెప్పారు. ఎంఎస్ ఆఫీస్, ట్యాలీ, DTP, C, C ప్లస్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు.
News April 18, 2025
రైలు నుంచి జారిపడి ఒకరి మృతి

రైలు నుంచి జారిపడి విజయనగరం జిల్లా వాసి మృతిచెందాడు. తుని జీఆర్పీ ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం..అన్నవరం-హంసవరం రైల్వే స్టేషన్ల మధ్యలో రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి అప్పారావు(55) మృతి చెందాడు. దర్యాప్తులో భాగంగా మృతుడు ఎల్.కోట మండలం వీరభద్రపేటకి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. గుంటూరు జిల్లాలో వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా ప్రమాదం జరిగిందన్నారు.