News August 4, 2024

పార్వతీపురం: దూర విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఛాన్స్

image

సార్వత్రిక విద్యాపీఠం 2024- 25 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్ దూర విద్యా విధానం కోర్సులలో ప్రవేశాల కోసం నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ప్రకటించారు. దీనికి సంబంధించిన గోడపత్రికను స్థానిక కలెక్టర్ కార్యాలయ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. చదువు మధ్యలో ఆపేసిన వారిని గుర్తించి లక్ష్యం మేర నమోదు ప్రక్రియ జరిగేవిధంగా చర్యలు చేపట్టాలని విద్యా శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News November 25, 2024

విజయనగరం TO పాడేరు వయా అరకు..!

image

విజ‌య‌న‌గ‌రం నుంచి అర‌కు మీదుగా పాడేరుకు త్వరలో బస్సు సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని ఆర్టీసీ జోన‌ల్ ఛైర్మ‌న్ సియ్యారి దొన్నుదొర చెప్పారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతం నుంచి ప‌ర్యాట‌కులు, ఉద్యోగులు అర‌కు, పాడేరు వెళ్లేందుకు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వారికి ఈ బ‌స్సు వ‌ల్ల ప్ర‌యాణం సుల‌భ‌త‌ర‌మ‌వుతుంద‌న్నారు.

News November 25, 2024

IPL వేలంలో యశ్వంత్‌కు నిరాశ

image

రెండో రోజు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలంలో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన బైలపూడి యశ్వంత్‌కు నిరాశ ఎదురైంది. త్వరలో జరగనున్న ఐపీఎల్ సీజన్‌కు రూ.30లక్షల బేస్ ప్రైస్‌తో యశ్వం‌త్ తన అదృష్టాన్ని పరీక్షించుకోగా.. తీసుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజ్‌లు ఆసక్తి చూపలేదు. దీంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.

News November 25, 2024

VZM: 40 మందికి ఎస్ఐ అర్హత పరీక్షలు

image

కైలాసగిరి ఆర్మడ్ రిజర్వు కార్యాలయంలో విశాఖ రేంజ్ పరిధిలో 40 మంది ఏఎస్ఐలకు ఎస్ఐ అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో రెండు రోజులుగా ఈ పరీక్షలు జరగుతున్నాయి. సోమవారం రాత పరీక్షలు నిర్వహించగా మంగళవారం అవుట్ డోర్, మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్లైన వారు డిసెంబర్ 2 నుంచి తిరుపతిలో జరిగే ఎస్ఐ ట్రైనింగ్‌కు వెళతారు.