News March 20, 2025
పార్వతీపురం: ‘నాణ్యమైన జీడిపప్పును కొనుగోలు చేయాలి’

వన్ ధన్ వికాస్ కేంద్రాల (వీడివీకె) సభ్యులు జిల్లాలో నెలకొల్పే జీడి పరిశ్రమలకు నాణ్యమైన జీడిపప్పును రైతుల నుంచి కొనుగోలు చేసుకునేలా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులకు సూచించారు.పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే జీడి పప్పును ముందుగా సిద్ధం చేసుకోవాలని అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో సబ్ కలెక్టర్లు, ఏపీఎంలు,ఉద్యానవన శాఖ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News March 21, 2025
కష్ట సమయాల్లో అండగా కోహ్లీ: సిరాజ్

ఆర్సీబీని వీడటం బాధగా ఉందని పేస్ బౌలర్ సిరాజ్ అన్నారు. తన కెరీర్‌లో విరాట్ కోహ్లీ ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. 2018-19లో క్లిష్ట పరిస్థితుల్లోనూ తన వెన్నంటి ఉన్నారన్నారు. ఆ తర్వాత తాను తిరిగి సత్తా చాటినట్లు తెలిపారు. గత ఏడాది వేలంలో సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఆర్సీబీ తరఫున 87 మ్యాచుల్లో 83 వికెట్లు తీశారు. ఆర్సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ సిరాజ్.
News March 21, 2025
ఈనెల 27న జిల్లా, మండల పరిషత్ సభ్యుల ఎన్నికలు

కర్నూలు జిల్లా, మండల పరిషత్‌లలో ఖాళీగా ఉన్న కోఆప్షన్ సభ్యులు, MPP పదవుల భర్తీకి ఈనెల 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ సులేమాన్ గతేడాది మార్చి 28న, క్రిష్ణగిరి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ షాలీసాహెబ్ ఈఏడాది జనవరి 1న మృతిచెందారు. వెల్దుర్తి, తుగ్గలి MPPలు శారద, ఆదెమ్మ రాజీనామా చేశారు. ఈ 4 పోస్టులకు ఈనెల 23న నోటిఫికేషన్ ఇచ్చి, 27న మధ్యాహ్నం సభ్యులను ఎన్నుకుంటారు.
News March 21, 2025
అక్రమ వలసదారుల కోసం ట్రంప్ కొత్త యాప్

అక్రమ వలసదారుల కోసం CBP హోమ్ యాప్ తీసుకొచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ యాప్‌ను ఉపయోగించి స్వచ్ఛందంగా వారి దేశానికి వెళ్లవచ్చని తెలిపారు. అలా వెళ్లడం ద్వారా తరువాతి కాలంలో లీగల్‌గా అమెరికాకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా అక్రమంగా ఉండి ప్రభుత్వానికి పట్టుబడితే వారిని అమెరికా నుంచి బహిష్కరించడంతో పాటు దేశంలోకి మరోసారి ప్రవేశముండదని ట్రంప్ హెచ్చరించారు.