News December 20, 2025
పార్వతీపురం: నాణ్యమైన పోషకాహారం అందించడమే ప్రధాన లక్ష్యం

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పోషకాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. చిన్నారులకు, గర్భిణులకు అందించే పాలు తాజాగా ఉండేలా చూడాలని, ఏపీ డెయిరీ ద్వారా సరఫరా ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకుండా పర్యవేక్షించాలన్నారు.
Similar News
News December 20, 2025
సిరిసిల్ల: ‘మీ డబ్బు.. మీ హక్కు కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి’

క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ఈ నెల 22 వ తేదీన ‘మీ డబ్బు.. మీ హక్కు’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రోగ్రామ్ కన్వీనర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 20, 2025
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

TG: రాష్ట్రంలో ఈ నెల 23 వరకు పలుజిల్లాల్లో శీతల గాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News December 20, 2025
జగన్‌ది రాక్షసత్వం: CM CBN

AP: యోగా డే నిర్వహణపై జగన్ వ్యాఖ్యల పట్ల CBN పరోక్షంగా స్పందించారు. ‘రంగురాళ్లపై బొమ్మలకోసం ₹700CR, రుషికొండకు గుండు కొట్టి ప్యాలెస్ కోసం ₹500 CR దుర్వినియోగం చేశారు. ప్రజారోగ్యం కోసం యోగా డే నిర్వహిస్తే విష ప్రచారం చేస్తున్నారు. PPPలో కాలేజీలు కడుతుంటే జైల్లో పెడతామంటున్నారు. ఇది వారి రాక్షసత్వానికి నిదర్శనం’ అని మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, అయినా వెనక్కు తగ్గేదే లేదని చెప్పారు.


