News January 31, 2025
పార్వతీపురం: నిన్న ఛార్జ్.. నేడు రిటైర్..!

పార్వతీపురం అదనపు SPగా నిన్న ఛార్జ్ తీసుకున్న నాగేశ్వరి నేడు రిటైరయ్యారు. జిల్లాలో కేవలం 24 గంటలు మాత్రమే అదనపు ఏఎస్పీగా విధులు నిర్వహించారు. 1989లో తొలిసారి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఆమె పదోన్నతులు పొందుతూ ASPస్థాయికి ఎదిగారు. తన తండ్రి పార్వతీపురంలోనే పోలీసు అధికారిగా పనిచేశారని.. దీంతో తన విద్యాభ్యాసం ఇక్కడే జరిగిందని గుర్తుచేసుకున్నారు. చిన్నప్పుడు చదువుకున్న చోట రిటైరవ్వడం ఆనందంగా ఉందన్నారు.
Similar News
News September 19, 2025
మైథాలజీ క్విజ్ – 10

1. శ్రీరాముడి పాదధూళితో శాపవిముక్తురాలైంది ఎవరు?
2. కురుక్షేత్ర యుద్ధంలో శకునిని ఎవరు చంపారు?
3. కృష్ణద్వైపాయనుడు అంటే ఎవరు?
4. మధుర మీనాక్షి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది?
5. చిరంజీవులు ఎంత మంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#mythologyquiz<<>>
News September 19, 2025
అన్నమయ్య: టాప్ గ్రేడ్ బొప్పాయి ధర@ రూ.8

అన్నమయ్య జిల్లాలో బొప్పాయి ఎగుమతికి ధరలను నిర్ణయించినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం తెలిపారు. టాప్ గ్రేడ్ బొప్పాయి ధర కిలో రూ.8గా, సెకండ్ గ్రేడ్ ధర కిలో రూ.7గా నిర్ణయించామన్నారు. తక్కువ ధరకు బొప్పాయిని కొనుగోలు చేసే ట్రేడర్లపై రైతులు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 9573990331, 9030315951ను అందుబాటులో ఉంచారు.
News September 19, 2025
బాపట్ల: 18-30 ఏళ్లు ఉన్న వారికే ఈ ఛాన్స్

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బాపట్లలో శనివారం జాబ్ మేళాను స్థానిక సాల్వేషన్ ఆర్మీ ఐటీఐ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి మాధవి తెలిపారు. అరబిందో ల్యాబ్స్, ముత్తూట్ ఫైనాన్స్, రిలయన్స్ ట్రెండ్, వరుణ్ మోటార్స్ తదితర కంపెనీలు హాజరుకానున్నాయన్నారు. 18-30 ఏళ్లు కలిగి పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమో, ఏంబీఏ చదివిన నిరుద్యోగులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.