News October 7, 2025

పార్వతీపురం నుంచి 30 ప్రత్యేక బస్సులు

image

విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర సందర్బంగా పార్వతీపురం జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు సేవలందిస్తున్నాయి. జిల్లా నుంచి 30 బస్సులు ఏర్పాటు చేసినట్లు RTC అధికారులు తెలిపారు. పార్వతీపురం డిపో నుంచి 10 బస్సులు, పాలకొండ నుంచి 12, సాలూరు డిపో నుంచి 8 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గతేడాది కంటే 6 బస్సులు అదనంగా ఏర్పాటు చేశామని మంగళవారం ఉదయం నుంచే సేవలందిస్తున్నాయన్నారు.

Similar News

News October 7, 2025

ధర్మపురి: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

JGTL(D) ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన బగ్గి లక్ష్మి(50)రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 5న నక్కలపేటలో రోడ్డుపై నడుస్తుండగా బుగ్గారం గ్రామానికి చెందిన రాజశేఖర్ అతివేగంగా కారు నడుపుతూ లక్ష్మిని ఢీ కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను JGTL ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI ఉదయ్‌కుమార్ తెలిపారు.

News October 7, 2025

పోషకాల పశువుల మేత ‘అవిశ’

image

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.

News October 7, 2025

HYD: హెచ్ఎండీఏకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన హైకోర్టు

image

గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణాలకు అనుమతిస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాము అనే వ్యక్తి దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ దాఖలుకు హెచ్ఎండీఏ పలు వాయిదాలు తీసుకుంది. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాస్ట్ ఛాన్స్‌గా రెండు వారాలు గడువు ఇచ్చింది. ఈలోపు కౌంటర్ దాఖలు చేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.