News February 19, 2026

పార్వతీపురం: ‘పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట’

image

జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి వేగవంతం చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్లో జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెండింగులో ఉన్న దరఖాస్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్యాంకులు రుణాల మంజూరులో జాప్యం ఉండరాదన్నారు.

Similar News

News February 21, 2026

ఖమ్మం బాట పట్టని ఎలక్ట్రిక్ బస్సులు

image

కాలుష్య నియంత్రణే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తున్నా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మాత్రం మొండిచేయి ఎదురైంది. ఆరు డిపోల నుంచి 28 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపినా, ఇప్పటివరకు ఒక్కటీ మంజూరు కాలేదు. ఛార్జింగ్ పాయింట్ల కోసం స్థల పరిశీలన జరిగినా ప్రక్రియ నెమ్మదించింది. ఆర్టీసీ యాజమాన్యం స్పందించి తక్షణమే ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాలని జిల్లా ప్రయాణికులు కోరుతున్నారు.

News February 21, 2026

వరంగల్ జిల్లాలో KTR వ్యాఖ్యలే కొంప ముంచాయా?

image

మున్సిపల్ ఎన్నికల్లో CM రేవంత్ రెడ్డిపై KTR వాడిన <<19088586>>పరుష పదజాలం<<>> ఉమ్మడి వరంగల్‌లో ఆపార్టీకి షాకిచ్చింది. జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో సగం దక్కించుకుంటామనుకున్న నేతలకు, ప్రచారంలో KTR చేసిన వ్యాఖ్యలే ఓటమికి కారణమయ్యాయని సీనియర్లు భావిస్తున్నారట. ఆ వ్యాఖ్యలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఈ విషయం తమ అధినాయకుడికి చెప్పేందుకు మాత్రం జంకుతున్నారట. మీరేమంటారు.

News February 21, 2026

త్వరలో అందుబాటులోకి తిరుపతి ఐఐటీ రోడ్డు

image

ఏర్పేడు వద్ద హైవే నుంచి వెంకటగిరి వెళ్లే మార్గంలో తిరుపతి ఐఐటీ మీదుగా నూతన రోడ్డు నిర్మించారు. రూ.98.6 కోట్లతో రోడ్డు నిర్మాణం పూర్తి చేసినా.. రైల్వే ట్రాక్‌పై గిడ్డర్లతో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై Way2Newsలో వార్త రావడంతో కలెక్టర్ పరిశీలించారు. ఆయన ఆదేశాలతో గిడ్డర్ ఏర్పాటు పనులు పూర్తి కావచ్చాయి. త్వరలోనే ఈ రోడ్డు ప్రజలకు అందుబాటులోకి రానుంది.