News October 13, 2025

పార్వతీపురం పీజీఆర్ఎస్‌కు 112 వినతులు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన సమస్యలను సత్వరమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం పిజిఆర్ఎస్ నిర్వహించారు. 112 మంది అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు

Similar News

News October 13, 2025

ప్రకాశం SP మీకోసంకు 71 ఫిర్యాదులు

image

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఏఎస్పీ నాగేశ్వరరావు, ఇతర అధికారులు ఎస్పీ మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో వారు మాట్లాడి సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు వెంటనే ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు.

News October 13, 2025

HYD: మీర్‌పేట్‌ మాధవి హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు

image

HYD బాలాపూర్ పరిధి మీర్‌పేట్‌ మాధవి హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఈనెల 17 నుంచి రోజువారీ జిల్లా ట్రయల్‌ కోర్టు విచారణ జరపనుంది. మాధవిని ఆమె భర్త గురుమూర్తి హత్య చేసి, ముక్కలు చేసి, కుక్కర్‌లో ఉడుకబెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో సైంటిఫిక్‌ ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. 2 నెలల్లో తీర్పు వస్తుందని సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.

News October 13, 2025

గద్వాల్: విద్యార్థులకు వ్యాస రచన పోటీలు

image

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా TG పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 6వ తరగతి నుంచి పీజీ వరకు ఉన్న విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు SP శ్రీనివాసరావు తెలిపారు.”డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్‌ నుంచి ఎలా దూరంగా ఉండగలరు” అనే అంశంపై 500 పదాలు మించకుండా వ్యాసం రాసి <>https://forms.gle/jaWLdt2yhNrMpe3eA<<>> ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని పంపలన్నారు. విజేతలకు బహుమతులు ఉంటాయన్నారు.