News February 24, 2025

పార్వతీపురం: ‘పీ-4 సర్వేని పక్కాగా చేపట్టాలి’

image

జిల్లాలో పీ-4 విధానంపై (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్ షిప్) సర్వేను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్షించారు. మార్చి 8 నుంచి 28వ తేదీ వరకు సర్వే చేయాలని సూచించారు. జిల్లాలో 2,65,000 గృహాలు ఉన్నాయని, వ్యవధి తక్కువగా ఉన్నందున ప్రణాళికబద్దంగా సర్వే పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

Similar News

News March 2, 2026

దాడికి ముందు ఇరాన్‌ పౌరులకు ఇజ్రాయెల్ మెసేజ్

image

ఇరాన్‌పై USతో కలిసి మొదటి దాడి చేసే కొన్ని నిమిషాల ముందు అక్కడి పౌరులు, అధికారులకు ఇజ్రాయెల్ సందేశం పంపినట్లు తెలుస్తోంది. ప్రార్థన వేళలు తెలిపే ‘బడే‌సబాహ్’ యాప్ హ్యాక్ చేసి నోటిఫికేషన్లు పంపింది. ‘ప్రతీకారానికి సమయం వచ్చింది’, ‘అమాయక ఇరాన్ ప్రజలను పీడిస్తున్న వారు ఆయుధాలు వదలండి’ అంటూ ఆ సందేశాలు సాగాయి. దాడిపై ఇరాన్ ప్రజల మద్దతు కోసం, అధికారులను హెచ్చరించేందుకు ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

News March 2, 2026

మైండ్‌లో మ్యాటర్.. హ్యాండ్‌లో పవర్ ఉండాలి: హరీశ్ రావు

image

పదవ తరగతి విద్యార్థులు చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. ఆదివారం ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. “మీ మైండ్‌లో మ్యాటర్ ఉంటేనే సరిపోదు.. పరీక్షలో వేగంగా రాయడానికి హ్యాండ్‌లో పవర్ ఉండాలి” అని చమత్కరించారు. ఏకాగ్రతతో చదివి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టి, తల్లిదండ్రులకు పేరు తేవాలని కోరారు.

News March 2, 2026

VZM: కలెక్టరేట్‌లో నేడు PGRS కార్యక్రమం

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.