News December 23, 2025

పార్వతీపురం: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

image

మక్కువ మండలం కొయ్యనపేట గ్రామానికి చెందిన బేతనపల్లి సీతం నాయుడు (75) ఈ నెల 15వ తేదీన పురుగుల మందు తాగారు. అప్పటి నుంచి పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. ఈ ఘటనపై మక్కువ ఎస్ఐ ఎం.వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News December 23, 2025

చరిత్రలో బ్రహ్మోత్సవాల పరంపర ఏంటి..?

image

తిరుమల బ్రహ్మోత్సవాల చరిత్ర పురాతనమైనది. లోకకళ్యాణం కోసం బ్రహ్మ ఈ ఉత్సవాలను ప్రారంభించాడట. అందుకే వీటిని ‘బ్రహ్మోత్సవాలు’ అంటారు. చారిత్రకంగా పల్లవ, చోళ, విజయనగర చక్రవర్తులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేవారు. ఒకప్పుడు భక్తుల రద్దీని బట్టి ఏటా 12 సార్లు కూడా బ్రహ్మోత్సవాలు జరిగేవని చెబుతారు. కాలక్రమేణా అవి తగ్గి, ప్రస్తుతం మనం చూస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలుగా స్థిరపడ్డాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 23, 2025

సన్నగా ఉన్నవారికి ఈ ఫ్యాషన్ టిప్స్

image

సన్నగా ఉన్నవారు మరీ బిగుతుగా ఉండే దుస్తులు వేసుకుంటే చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. వీరు కాస్త వదులుగా ఉండే, సమాంతర గీతలుండే దుస్తులు, లేయర్డ్ డ్రెస్‌లు ఎంచుకోవాలంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. వీటితో పాటు నడుముకి బెల్టు, కాళ్లకు హీల్స్‌ వాడకపోవడమే మంచిది. ఎలాంటి శరీరాకృతి ఉన్నా తమను తాము అంగీకరించి, చక్కని ఆహార్యాన్ని మెయింటైన్ చేస్తూ ఆత్మవిశ్వాసంతో ఉండాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

News December 23, 2025

CSIR-CERIలో ఉద్యోగాలు

image

CSIR-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (<>CERI<<>>) 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి ME/M.Tech, MSc కెమిస్ట్రీ, BE/B.Tech, డిప్లొమా ఉత్తీర్ణులు డిసెంబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. మిగతా పోస్టులకు 35ఏళ్లలోపు గలవారు అర్హులు. జనవరి 2న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.cecri.res.in