News December 20, 2025
పార్వతీపురం: ‘ప్లాస్టిక్ తయారీ యూనిట్లపై నిరంతర నిఘా ఉంచాలి’

ప్లాస్టిక్ తయారీ యూనిట్లపై పరిశ్రమల శాఖ నిరంతర నిఘా ఉంచాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మార్కెట్లు, దుకాణాలు, గ్రామీణ వారపు సంతల్లో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగం అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Similar News
News December 22, 2025
పోలవరానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలి: పవన్

AP: అమరజీవి పొట్టి శ్రీరాములుకు గౌరవం ఇవ్వాలంటే పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని Dy.CM పవన్ అభిప్రాయపడ్డారు. తన ఆలోచనపై అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. మహనీయుడు అంబేడ్కర్‌కు కూడా కులం ఆపాదించడం సరికాదన్నారు. ‘పదవి-బాధ్యత’ సమావేశంలో ఆయన మాట్లాడారు.
News December 22, 2025
ఐడియాలజీ సరైంది కాకుంటే ఇబ్బందులు: పవన్

AP: జనసేన కోసం పనిచేసిన వారందరినీ గుర్తించామని పార్టీ చీఫ్, Dy.CM పవన్ చెప్పారు. నామినేటెడ్ పదవులు పొందినవారితో మంగళగిరిలో మాట్లాడారు. ‘ఓడిపోయినా నిలబడినందుకే మీకు పదవులు వచ్చాయి. మీరంతా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. యువతకు సరైన వేదికగా నేను పార్టీ పెట్టా. అప్పట్లో కొత్త పంథాను నమ్ముకుని మావోలుగా మారి వేలాదిమంది చనిపోయారు. ఐడియాలజీ సరైంది కాకుంటే ఇలాంటి ఇబ్బందులొస్తాయి’ అని తెలిపారు.
News December 22, 2025
ఖమ్మం జిల్లాలో రూ.68కోట్లకు పైగా బోనస్: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 331 కొనుగోలు కేంద్రాల ద్వారా 43,236 మంది రైతుల నుంచి 2,51,847 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 90 శాతం రైతులకు రూ.530 కోట్లకు పైగా చెల్లింపులు చేశామని చెప్పారు. సన్న వడ్లకు రూ.68 కోట్లకు పైగా బోనస్ అందించామన్నారు.


