News January 29, 2025
పార్వతీపురం ఫ్లైఓవర్‌పై యువకుడు మృతి

బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు బుధవారం మృతి చెందాడు. ఈ ఘటన పార్వతీపురం ఫ్లైఓవర్‌పై చోటుచేసుకుంది. మృతుడు పార్వతీపురంలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న సంతుగా గుర్తించారు. అతనిది బెలగాం అని ప్రమాదానికి గల కారణాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.
Similar News
News February 16, 2026
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

CSIR-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CDRI)లో 5 హిందీ ఆఫీసర్, MTS పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరుతేదీ. పోస్టును బట్టి పీజీ(హిందీ, ఇంగ్లిష్), టెన్త్/ITI, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. హిందీ ఆఫీసర్ పోస్టును రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా, MTS పోస్టులను ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdri.res.in/
News February 16, 2026
నల్గొండ: మున్సిపల్ ఎన్నికల్లో బీసీల హవా

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు అద్భుత విజయం సాధించారు. మొత్తం 17 మున్సిపాలిటీల్లోని 329 వార్డులకు గాను, 184 చోట్ల (56 శాతం) బీసీలు గెలుపొందారు. నల్గొండ కార్పొరేషన్‌లో ఏకంగా 60 శాతం డివిజన్లను కైవసం చేసుకున్నారు. కేవలం రిజర్వ్‌డ్ స్థానాల్లోనే కాకుండా, జనరల్ స్థానాల్లోనూ పోటీ చేసి సత్తా చాటారు. ఈ ఫలితాలు జిల్లా రాజకీయాల్లో బీసీల ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పాయి.
News February 16, 2026
భద్రాద్రి: రేపటి నుంచి సర్పంచ్లకు రెండో విడత శిక్షణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు రేపటి నుంచి రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. 235 మంది సర్పంచ్లకు ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకు పల్లె పాలనపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. టేకులపల్లి 36, ఇల్లందు 29, దమ్మపేట 31, అశ్వారావుపేట 27, జూలూరుపాడు 23, లక్ష్మీదేవిపల్లి 31, దుమ్ముగూడెం 37,ములకలపల్లి 19 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు.


