News February 26, 2026

పార్వతీపురం: బాల్య వివాహాలు చేస్తే జైలుకే: కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్టు సమాచారం తెలిస్తే జరిపించిన తల్లిదండ్రులతో పాటు సర్పంచ్‌ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి హెచ్చరించారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్లో ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. బాలికకు వివాహ వయసు రాకుండా వివాహం జరిపిన వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదుచేయాలని ఆదేశించారు.

Similar News

News February 26, 2026

కన్నులపండువగా శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

image

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. తొలిరోజు స్వామి పుష్కరిణిలో తెప్పపై మూడు సార్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.

News February 26, 2026

జింబాబ్వేపై భారత్ విధ్వంసం.. స్కోర్ ఎంతంటే?

image

T20WC: చెన్నై వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగారు. దీంతో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్(55) హాఫ్ సెంచరీ చేశారు. ఇషాన్(38), సంజూ(24), సూర్య(33) రాణించారు. చివర్లో హార్దిక్(23 బంతుల్లో 50*), తిలక్(16 బంతుల్లో 44*) మెరుపులు మెరిపించారు. జింబాబ్వే టార్గెట్ 257 రన్స్.

News February 26, 2026

MBNR: రాజ్ కోట్ – మహబూబ్ నగర్ మధ్య ప్రత్యేక రైళ్ల పొడిగింపు.!

image

ఉమ్మడి జిల్లా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజ్‌కోట్ – మహబూబ్ నగర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సేవలను రైల్వే శాఖ మార్చి 2026 వరకు పొడిగించింది. రైలు నం.09575 (రాజ్‌కోట్-మహబూబ్ నగర్) ప్రతి సోమవారం, రైలు నం.09576 (మహబూబ్ నగర్-రాజ్‌కోట్) ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటాయి. మార్చి నెలలో ఎంపిక చేసిన తేదీల్లో ఈ సర్వీసులు నడుస్తాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.