News April 7, 2025
పార్వతీపురం: ‘బిసి యూనిట్ల ఏర్పాటు వేగవంతం చేయాలి’

జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేయుటకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని ఆమేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో ఇంటర్వ్యూలు పూర్తి చేశారని ఆయన చెప్పారు.
Similar News
News December 27, 2025
జనవరి 3, 4, 5 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు

AP: జనవరి 3,4,5 తేదీల్లో గుంటూరు జిల్లాలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల పాటు 22 సాహితీ సదస్సులు నిర్వహించనుండగా, 4 రాష్ట్రాల గవర్నర్లు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే 40 దేశాలకు చెందిన 62 తెలుగు సంఘాలకు ఆహ్వానాలు పంపారు. NTR పేరిట ప్రధాన వేదిక ఏర్పాటు కానుంది. ఈ సభలకు తెలుగువారి అనురాగ సంగమంగా నామకరణం చేశారు. 3రోజుల్లో లక్ష మంది వస్తారని అంచనా.
News December 27, 2025
నిర్మల్: వార్డు మెంబర్ SUICIDE

అప్పుల బాధతో వార్డు మెంబర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జల్లా దిలావర్పూర్ మం. కాల్వలో జరిగింది. SI రవీందర్ ప్రకారం.. గ్రామానికి చెందిన నరేశ్(31) GP ఎన్నికల్లో వార్డు మెంబర్గా గెలిచాడు. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక కొన్ని రోజులుగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News December 27, 2025
అనకాపల్లి: జెడ్పీ సమావేశాలకు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి

జెడ్పీ సమావేశాలకు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని జెడ్పీ చైర్ పర్సన్ సుభద్ర అన్నారు. హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలు శుక్రవారం విశాఖ జెడ్పీ సమావేశ మందిరంలో జరిగాయి.పీఏసీఎస్ లలో రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు మునగపాక జడ్పిటిసి పెంటకోట స్వామి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలురను క్రమశిక్షణలో ఉంచాలని జడ్పీ చైర్పర్సన్ సూచించారు.


