News March 26, 2025
పార్వతీపురం: బీసీ కులస్థులకు 90 శాతం సబ్సిడీతో పరికరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుల వృత్తిదారులకు అవసరమయ్యే అత్యాధునిక పరికరాలను 90% సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు బీసీల కోసం బడ్జెట్ కేటాయించిన విషయం తెలిసిందే. అయితే లబ్ధిదారులు నేరుగా వృత్తి పరికరాలను ఎంపిక చేసుకునే అవకాశం వినియోగించుకోవాలని బీసీ కార్పొరేషన్ ఈడీ ఆర్. గడ్డెమ్మ పార్వతీపురంలో జరిగిన సంక్షేమ సమీక్ష సమావేశంలో తెలిపారు. దరఖాస్తులను తమకు ఇవ్వాలని కోరారు.
Similar News
News February 24, 2026
గద్వాల: పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో 12 పతకాల పంట

రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో గద్వాల జిల్లా సిబ్బంది 12 పతకాలతో సత్తా చాటారని ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. రామాంజనేయులు (2 గోల్డ్, 4 బ్రాంజ్), రవి (2 గోల్డ్, 2 బ్రాంజ్)లతో పాటు పృథ్వీ, నాగరాజు హాకీలో పతకాలు సాధించారు. విజేతలను మంగళవారం ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
News February 24, 2026
శ్రీకాకుళం: జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల నిర్వహణ

శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో మంగళవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. అండర్-18 పురుషులు, మహిళల విభాగంలో ఈ పోటీలు జరిగాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేశ్ బాబు పోటీలను పర్యవేక్షించారు. విజేతలు ఈనెల 28న ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
News February 24, 2026
గద్వాల: ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు

గద్వాల జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 14 కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS (144 సెక్షన్) అమలులో ఉంటుందని, 8,471 మంది విద్యార్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. మార్చి 16 వరకు జరిగే ఈ పరీక్షల సమయాల్లో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు.


