News October 25, 2025

పార్వతీపురం మన్యంలో గిరిజన విద్యార్థిని మృతి

image

సీతంపేట మండలం పీవీ ఈతమానుగూడ పంచాయతీ పరిధిలో దొంబంగివలస గ్రామానికి చెందిన గిరిజన బాలిక మండంగి కవిత (11) మరణించింది. ఈ బాలిక హడ్డుబంగి ప్రభుత్వ గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో 6వతరగతి చదువుతుంది. ఇటీవల ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు గురైన బాలికను కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 25, 2025

విశాఖ: 69 మంది పోలీసులకు రివార్డులు

image

విశాఖ పరిధిలో ప్రతిభ కనబర్చిన 69 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారులు రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెలా రివార్డులను అందజేస్తున్నారు.

News October 25, 2025

NRPT: డిజిటల్‌ భద్రతపై అవగాహన సదస్సు

image

డిజిటల్‌ భద్రతపై అవగాహన కల్పించేందుకు నారాయణపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సిక్తా పట్నాయక్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ…
ఇలాంటి అవగాహన సదస్సులు ప్రజల్లో డిజిటల్‌ బాధ్యతా భావం పెంచి, సైబర్ భద్రత సంస్కృతిని బలపరుస్తాయని అన్నారు. హైద్రాబాద్‌కు చెందిన సైబర్ నిపుణులు, న్యాయవాది రూపేష్ మిత్తల్, సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.

News October 25, 2025

నారాయణపేట: చిరుత పులి మృతి

image

నారాయణపేట జిల్లా పేరపళ్ళ రెవెన్యూ అటవీ ప్రాంతంలో శనివారం స్థానికులు ఒక చిరుత పులి మృతిచెందినట్లు గుర్తించారు. ఫారెస్ట్ ఆఫీసర్ సంతోష్ కుమార్‌కు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కమల్ ఉద్దీన్‌తో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. చిరుతపులి మృతికి కారణాలపై విచారణ చేస్తామన్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కళేభరం తరలించారు. పోస్టుమార్టం తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.