News April 22, 2025
పార్వతీపురం మన్యంలో నేటి ఉష్ణోగ్రతలు ఇలా

పార్వతీపురం జిల్లాలో మంగళవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని APSDM తెలిపింది. ఉదయం 10 తర్వాత బయటికొచ్చే వారంతా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. సీతానగరం, గరుగుబిల్లి మండలాల్లో 43.9°C, బలిజిపేట, గుమ్మలక్ష్మీపురం పార్వతీపురం మండలాల్లో 43°C పైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. మిగిలిన అన్ని మండలాల్లో 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదు అవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Similar News
News December 18, 2025
AMCల రాబడి పెంచాలి: JDM రామాంజనేయులు

AMCల రాబడిని పెంచాలని రాయలసీమ JDM రామాంజనేయులు కార్యదర్శులకు సూచించారు. గురువారం కడపలోJDM రామాంజనేయులు అధ్యక్షతన కడప, అన్నమయ్య జిల్లాల AMCలపై సమీక్ష నిర్వహించారు. వంద శాతం లక్ష్యాలు సాధించాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల మిల్లులకు వెళ్లి పరిశీలించాలన్నారు. చెక్ పోస్టుల వద్ద నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో DDM లావణ్య, ADM అజాద్, 20 మంది AMCల కార్యదర్శులు పాల్గొన్నారు.
News December 18, 2025
ఎరువుల బుకింగ్ మొబైల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

నూతనంగా ప్రవేశపెట్టిన ఎరువుల బుకింగ్ యాప్‌ను జిల్లా రైతుల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర సూచించారు. పట్టాదారు పాస్ పుస్తకం లేకున్నా భూమి వివరాలు ఆధార్ కార్డుతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మరుసటి రోజే సమీపంలోని దుకాణం నుంచి ఎరువులను తీసుకోవచ్చన్నారు. రెండో స్లాట్ బుకింగ్‌కు కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలన్నారు.
News December 18, 2025
అంకితభావం చాటిన అధికార యంత్రాంగం!

కామారెడ్డి జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను ఎన్నికల విభాగాల సిబ్బంది కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.


