News January 8, 2026
పార్వతీపురం: మన్యం కళావేదికగా నృత్య పోటీలు

మన్యం కళావేదికగా శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి నృత్య పోటీలు జరుగుతాయని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరై పోటీలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. మండల స్థాయి పోటీలు బుధవారంతో ముగిశాయని, శుక్రవారం జిల్లా స్థాయి పోటీలు జరగనున్నట్లు చెప్పారు.
Similar News
News January 9, 2026
సర్దాపూర్: ‘మిమ్మల్ని చూస్తే ఐపీఎస్ శిక్షణ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి’

మిమ్మల్ని చూస్తే 2019లో తాను ఐపీఎస్ శిక్షణ తీసుకున్న ఙ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సర్దాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ వార్షిక క్రీడా పోటీల ముగింపు వేడుకలకు ఆమె హాజరై మాట్లాడారు. ఫిట్నెస్ క్రమశిక్షణ, నిత్యజీవితంలో ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. యోగా, వ్యాయామం, నడక ఏదైనా తప్పనిసరిగా చేయాలని సూచించారు. విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.
News January 9, 2026
వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించడమే ప్రధాన లక్ష్యం: కలెక్టర్

జిల్లాలో బానిస కూలీల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి, వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించడమే అధికారుల ప్రధాన లక్ష్యమని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల కార్మిక రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాలన్నారు. చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
News January 9, 2026
ఖమ్మం జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో యాసంగి సాగు అవసరాలకు తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 10,942 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉందని, ఇప్పటి వరకు రైతులకు 36,314 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు వెల్లడించారు. రైతులు యూరియా కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.


