News March 9, 2025

పార్వతీపురం మన్యం జిల్లాకు 35 మంది ఎస్ఐలు 

image

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డిని నూతన ప్రొబేషనరీ ఎస్ఐలు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల అనంతపురం ట్రెయినింగ్ కళాశాలలో శిక్షణ ముగించుకుని ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం కేటాయించిన 35 మంది జిల్లాకు వచ్చారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తూ, పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా విధులను నిర్వర్తించాలని ఎస్పీ తెలిపారు. 35 మందికి వివిధ పోలీస్ స్టేషన్లను కేటాయించారు.

Similar News

News March 9, 2025

నల్గొండ: ఎమ్మెల్సీగా శంకర్ నాయక్ ఫైనల్..!

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ కోటాలో ఆయన పేరును ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, శంకర్ నాయక్‌కు మిర్యాలగూడ, హుజూర్‌నగర్, నాగార్జున సాగర్ గిరిజన తండాల్లో పట్టుంది. జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ఇతర ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

News March 9, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. ప్రైజ్ మనీ ఎంతంటే?

image

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య CT ఫైనల్ జరుగుతోంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ గెలిచిన టీంకు 2.24 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ అందనుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 1.12 మిలియన్ డాలర్లు లభిస్తాయి. టోర్నీలో పాల్గొన్నందుకు IND, NZ సహా అన్ని టీంలు $125,000, గ్రూప్ స్టేజ్‌లో గెలిచిన టీంలు 34,000 డాలర్లు అందుకుంటాయి. 5, 6 స్థానాల్లో నిలిచిన జట్లకు $350,000, 7,8 స్థానాల్లో నిలిచిన జట్లకు $140,000 లభిస్తాయి.

News March 9, 2025

NGKL: SLBC టన్నెల్‌లో మృతదేహాల కోసం ప్రయత్నం

image

దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసినప్పటికీ అతనికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. ఆ మృతదేహం పక్కనే మరో రెండు మృతదేహాలు ఉన్నప్పటికీ వాటిని వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

error: Content is protected !!