News April 4, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో నేటి ఉష్ణోగ్రతల వివరాలు..

image

పార్వతీపురం జిల్లాలో శుక్రవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని APSDM తెలిపింది. ఉదయం 10 తర్వాత బయటికొచ్చే వారంతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సాలూరులో 37.1°C, మక్కువ 39.1, పాచిపెంట 36.8, కురుపాం 40.8, గరుగుబిల్లి 41.3, గుమ్మలక్ష్మీపురం 41.2, కొమరాడ 40.7, జియ్యమ్మవలస 41.2, పార్వతీపురం 40.3, సీతానగరం 40.6, బలిజిపేట 40.3, పాలకొండ 39.4, వీరఘట్టం 40.3, సీతంపేట 39, భామిలో 39.7గా నమోదౌతాయని తెలిపింది.

Similar News

News April 5, 2025

నేటి నుంచి సిరసనగండ్ల బ్రహ్మోత్సవాలు

image

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరసనగండ్ల శ్రీ సీతారామ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రెండో భద్రాద్రిగా పేరుపొందిన సిరసనగండ్ల బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాలకు దేవాలయాన్ని దేదీప్యమానంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వహణ అధికారులు వెల్లడించారు. 

News April 5, 2025

గద్వాల: అది దారుణం: BRS

image

గద్వాల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని BRS రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గద్వాలలో మీడియాతో ఆయన మాట్లాడారు. మండలంలో ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసి ఇళ్లు కేటాయించడం దారుణమన్నారు. మిగిలిన గ్రామాల్లో అర్హులు లేరా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

News April 5, 2025

KMR: 9 నెలల జైలు శిక్ష

image

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి KMR జిల్లా న్యాయస్థానం 9 నెలల జైలు శిక్ష, జరిమానా విధించింది. బిక్కనూర్ పోలీసుల వివరాల ప్రకారం ముత్త గౌడ్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. బోయిన స్వామి అతివేగంగా ఆటోతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముత్త గౌడ్ మృతి చెందాడు. బిక్కనూర్ PSలో కేసు నమోదైంది. విచారణ అనంతరం స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి ఈ మేరకు తుది తీర్పు ఇచ్చారు.

error: Content is protected !!