News April 10, 2025
పార్వతీపురం మన్యం జిల్లాకు మంజూరైన బీసీ యూనిట్లు ఇవే..

పార్వతీపురం మన్యం జిల్లాకు బీసీ యూనిట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాచిపెంట మండలానికి 52, గరుగుబిల్లి 87, కొమరాడ 50, సీతానగరం 35, సాలూరు 42, గుమ్మలక్ష్మీపురం 14, కురుపాం 5, భామిని 23, జియ్యమ్మవలసకు 3 మంజూరైనట్లు తెలిపారు. మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో చర్యలు వేగవంతం చేసి 11వ తేదీ నాటికి సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.
Similar News
News July 4, 2025
HYDలో భారీగా ట్రాఫిక్ జామ్

HYDలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ఎల్బీస్టేడియంలో బహిరంగ సభతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఈ ప్రభావంతో PVNR ఎక్స్‌ప్రెస్ వే నుంచి మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్ నుంచి నాంపల్లి, పంజాగుట్ట నుంచి రవీంద్రభారతి రూట్‌లో వాహనాలు కిలో మీటర్ మేర నిలిచిపోయాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రద్దీ మరింత పెరుగుతోంది.
News July 4, 2025
ఫ్లడ్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

జిల్లాలో వరదలు ఎప్పుడు సంభవించిన ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ఆదుకునేందుకు మండలాల వారీగా ఫ్లడ్ యాక్షన్ ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాలు, మండలాల వారీగా వరద సహాయక చర్యలపై కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని, ముంపు గ్రామాలు, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై తహశీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.
News July 4, 2025
డీహైడ్రేషన్‌తోనే విద్యార్థులకు అస్వస్థత: FactCheck

సోమందేపల్లి మం. పాపిరెడ్డిపల్లి కస్తూర్బా హాస్టల్‌లో కలుషిత ఆహారంతో 15 మంది అస్వస్థతకు గురైనట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని ప్రభుత్వం పేర్కొంది. ‘విద్యార్థులలో రక్తహీనత నివారణకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వడం ప్రభుత్వ కార్యక్రమం. ఇవి 232 మందికి ఇవ్వగా 15మంది డీహైడ్రేషన్‌కు గురయ్యారు. అస్వస్థతకు కలుషిత ఆహారం కారణం కాదు’ అని ట్వీట్ చేసింది.