News August 18, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 287.4 mm వర్షపాతం

పార్వతీపురం మన్యం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 287.4మి.మి. నమోదైనట్లు కలెక్టరేట్ నుంచి ప్రకటన విడుదల చేసింది. అత్యధికంగా పాలకొండలో 40.6 మి.మీ, అత్యల్పంగా సీతంపేట2 మి.మీ వర్షం పడింది. G.M వలస-7.2, భామిని-21.2, వీరఘట్టం-12.6, కురుపాం-7.4, గరుగుబిల్లి-9.2, సాలూరు19.6, G.Lపురం 9.6, కొమరాడ 39.2, పార్వతీపురం23.4, పాచిపెంట17.0, మక్కువ 11.8, సీతానగరం 14.2 బలిజి పేట 25.2 మి.మి.వర్షపాతం నమోదయిందన్నారు.
Similar News
News August 20, 2025
సిద్దిపేట: మట్టి బతుకుల్లో ‘భరోసా’

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఫొటోగ్రాఫర్‌ల నుంచి ఫొటోలను ఆహ్వానించింది. అందులో సిద్దిపేటకు చెందిన ఫొటోగ్రాఫర్ సతీశ్‌కు రైతు భరోసా నేపథ్యంలో తీసిన ఫోటో రాష్ట్రస్థాయి బహుమతికి ఎంపికైంది. రాష్ట్రస్థాయి అవార్డుకు ఫొటో ఎంపిక కావడంతో ఫొటోగ్రాఫర్ సతీశ్‌కు మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పురస్కారం అందించారు.
News August 20, 2025
కన్నీళ్లు పెట్టిస్తున్న PHOTO

TG: నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లే ఆ పిల్లల ఊపిరి తీసింది. HYD శివారు బాచుపల్లిలో తల్లి లక్ష్మి తన ఇద్దరు పిల్లల(ఒకరు 8 నెలలు, మరొకరు మూడేళ్లు)ను నీటి సంపులో పడేసింది. అప్పటివరకు ఆనందంగా ఆడుకున్న ఆ చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు విడిచారు. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు చిన్నారుల మృతదేహాలను వెలికితీయగా ఆ దృశ్యం చూసినవారిని కంటతడి పెట్టిస్తోంది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News August 20, 2025
హైకోర్టులో కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్కెదురు

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు, పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.