News August 27, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 65 MM వర్షపాతం నమోదు

పార్వతీపురం మన్యం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 65 MM నమోదైనట్లు అధికారులు బుధవారం తెలిపారు. అత్యధికంగా కొమరాడలో 11.4, అత్యల్పంగా సీతంపేటలో 1.0 MM వర్షం పడిందన్నారు. జియ్యమ్మవలసలో 2.8, భామినిలో 7.4, వీరఘట్టంలో 4.4, పాలకొండలో 4.6, గుమ్మలక్ష్మీపురంలో 2.4, కురుపాంలో 4.4, పార్వతీపురంలో 1.2, సాలూరులో 2.2, పాచిపెంటలో 4.2, మక్కువలో 8.0, సీతానగరంలో 4.4, బలిజిపేటలో 3.6 మిల్లీమీటర్ల.వర్షపాతం నమోదైందన్నారు.
Similar News
News August 27, 2025
రాజంపేట: ముఖ్యమంత్రి పర్యటన కోసం స్థలాల పరిశీలన

రాజంపేటలో సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా అధికారులు బుధవారం రాజంపేటలో స్థలాలను పరిశీలించారు. అన్నమయ్య కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఇతర అధికారులు పలు ప్రాంతాలను పరిశీలించారు. హెలిప్యాడ్, బహిరంగ సభ, కార్యకర్తల సమావేశం కోసం అనువైన స్థలాలను పరిశీలించారు. కొత్త బోయిన పల్లె, తాళ్లపాక, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాలను వారు పరిశీలించారు.
News August 27, 2025
అమరావతిలో అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ?

అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నారు. ఇది 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన జ్ఞాన కేంద్రంగా రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ఈ లైబ్రరీని నిర్మించడానికి ఒక ప్రముఖ వ్యాపార దిగ్గజం ₹100 కోట్లు విరాళంగా ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.
News August 27, 2025
ప్రకాశం ఎస్పీ కార్యాలయంలో వినాయక చవితి పూజలు.!

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందికి ప్రసాదాన్ని ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.