News September 13, 2025

పార్వతీపురం మన్యం జిల్లాకు చేరుకున్న కొత్త కలెక్టర్

image

ఇటీవల బదిలీపై పార్వతీపురం మన్యం జిల్లాకు కలెక్టర్‌గా నియమించబడ్డ ప్రభాకర్ రావు కలెక్టరేట్‌కు శనివారం చేరుకున్నారు. ఆయనకు పలువురు అధికారులు పుష్ప గుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాలో సమస్యలు గుర్తించి వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తామన్నారు.

Similar News

News September 13, 2025

‘సిగాచీ’పై నివేదిక రెడీ.. ఇక సర్కారు నిర్ణయమే తరువాయి

image

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది మరణించిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణను పూర్తి చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ కు విచారణ నివేదికను అందజేశారు. ప్రమాదానికి కారణాలతోపాటు ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సభ్యులు కూలంకుషంగా నివేదికలో పొందుపరిచారు.

News September 13, 2025

మోదీ మణిపుర్ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు

image

ఘర్షణలు జరిగిన రెండేళ్ల తర్వాత PM మోదీ మణిపుర్‌ <<17696611>>పర్యటన<<>>కు వెళ్లడం అక్కడి ప్రజలను అవమానించడమేనని INC మండిపడింది. ‘864 రోజుల ఘర్షణలో 300 మంది చనిపోయారు. 1500 మంది గాయపడ్డారు. 67వేల మంది నిర్వాసితులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు PM 46 విదేశీ పర్యటనలు చేశారు కానీ ఒక్కసారి కూడా మణిపుర్‌లో పర్యటించలేదు’ అని ఖర్గే విమర్శించారు. రెండేళ్ల తర్వాత మోదీ మణిపుర్ వెళ్లడం దురదృష్టకరమని ప్రియాంకా గాంధీ అన్నారు.

News September 13, 2025

నెల్లూరు: ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి మైథిలి కళ్లు దానం

image

స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురైన మైథిలి ప్రియా కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. ప్రస్తుతం మైథిలి మృతదేహం నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంది. గత రాత్రి మైథిలిని ఆమె స్నేహితుడు నిఖిల్ దారుణంగా హత్య చేశాడు. మృతురాలు బి ఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది.