News November 22, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో ఐదు NRCలు: మంత్రి

image

నేషనల్ హెల్త్ మిషన్ కింద పార్వతీపురం మన్యం జిల్లాలో 5 NRCలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులకు సేవలు అందించేందుకు వీలుగా న్యూట్రిషన్ రిహబిలిటేషన్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. 5 పడకలతో సాలూరు, పాలకొండ, భద్రగిరి, కురుపాం, చినమేరంగి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు.

Similar News

News November 22, 2025

ములుగు: టీఆర్‌పీ సోషల్ మీడియా కన్వీనర్ల నియామకం

image

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాలోని 10 మండలాలకు సోషల్ మీడియా కన్వీనర్లను ప్రకటించింది. ములుగుకు బుద్దే రాజు, వెంకటాపూర్- దుగ్గొని నిశాల్, గోవిందరావుపేట- సునావత్ మోహన్ రావు, ఏటూరునాగారం- గగ్గురీ రాంబాబు, వాజేడు- బొల్లె రమేష్, వెంకటాపురం- శ్రీరామ్ నాగ సునీల్, కన్నాయిగూడెం- భీముని నరేష్, మంగపేట- బండి సందీప్, మల్లంపల్లి- నూనె రాజ్ కుమార్‌లను నియమించినట్లు జిల్లా కన్వీనర్ తెలిపారు.

News November 22, 2025

సిరిసిల్ల: బడి చేరాలంటే వాగు దాటాల్సిందే..!

image

వాగు దాటితేనే ఆ ఊరి పిల్లలకు చదువు. ప్రతిరోజు విద్యార్థులు చదువు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. SRCL(D) కోనరావుపేట మండలంలోని వెంకట్రావుపేట, కొండాపూర్ గ్రామాల విద్యార్థులు మూలవాగు అవతల ఉన్న బావుసాయిపేట పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. వరద ఉద్ధృతికి ఏళ్ల క్రితం నాటి వంతెన కొట్టుకుపోగా పాలకులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. దీంతో చిన్నారులు నిత్యం వాగులో నుంచే పాఠశాలకు చేరుతున్నారు.

News November 22, 2025

HYD: నేడు కార్గో వస్తువుల వేలం

image

HYDలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌లో పెండింగ్‌లోని కార్గో, పార్సిల్ వస్తువులకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జోన్ లాజిస్టిక్ మేనేజర్ బద్రి నారాయణ తెలిపారు. MGBSలోని పార్సిల్ గోడౌన్ ఆవరణలో ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని కోరారు.